Advertisements

6th Class Science bits

Science bits
Science bits
Advertisements

6వ తరగతి సైన్స్ బిట్స్ 

 

Science bits

Science bits

@ కూరగాయలతో డిజైన్ –వెజిటబుల్ కార్వింగ్ అంటారు.

# సాలడ్ = సాలట అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలట అంటే ఉప్పు.

$ టమాటలో కేరోటినాయిడ్లు, లైకోపినాలు, విటమిన్ -c ఉంటాయి. కాబట్టి టమాట తినడం వల్ల  కాన్సర్ రాదు.

@ నియోడైమియం -బలమైన అయస్కాంతం.

# రాయి -సహజ అయస్కాంతం.దీన్ని లోడ్ స్టోన్ అంటారు. వీటిని శత్రువుల నౌకలను ముంచడానికి ఉపయోగించేవారు.

$ అయస్కాంతం యొక్క ఉత్తర ,దక్షిణ దిక్కులను సూచించడంను అయస్కాంత దిశా దర్మం అంటారు.

@ ఐరన్,నికాల్,కోబాల్ట్,అల్యూమినియం,రాగి మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలు తయారు చేస్తారు.

* ఇనుము లేదా ఉక్కు తో సాదారణ అయస్కాంతాలు తయారు చేస్తారు.

@ భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల  వల్ల భూమి అయస్కాంతంగా పని చేస్తుంది.

# వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది.

$ వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్డం ఉంటుంది.

* నీరు 3 రూపాలలో ఉంటుంది. అవి;ద్రవ, వాయు, భాష్పీభవన రూపంలో ఉంటుంది.

@ నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను భాష్పిభవనం అంటారు.

# నీటి ఆవిరి నీరుగా మారడంను సాంద్రీకరణం అంటారు.

$ గొడుగును మొదటగా రూపొందించింది ఈజిప్తులు.

* పరిశ్రమలు,వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్,నైట్రోజెన్ డైఆక్సైడ్ వల్ల మేఘాలు కలుషితమైతే ఆమ్ల వర్షాలు కురుస్తాయి.

@ జూన్ -సెప్టెంబర్ –నైరుతి ఋతుపవనాలు

# నవంబర్-డిసెంబర్ –ఈశాన్య ఋతుపవనాలు అంటారు.

Science bits

* 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రిక్రేమ్బియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి.

@ ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే వాటిని శాఖాహారులు అంటారు.

# ఆహారం కోసం ఇతర  జంతువులపై ఆధారపడే వాటిని మాంసాహారులు అంటారు.

$ ఆహరం కోసం మొక్కలు ,జంతువులు  రెండిటిపై ఆధారపడే వాటిని ఉభయచరాలు అంటారు.

* ఎగరలేని పక్షులు –పెంగ్విన్,ఆస్ట్రిచ్,ఈము,రేహ .

@ పాండ్ స్కేటర్స్ అనే కీటకం నీటి అలలను గుర్తించి ఇతర కీటకాలను తింటాయి.

# జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు.అవి 1)అకశేరుకాలు,2)సకశేరుకాలు,3)ఉబయచారాలు,4)సరీసృపాలు,5)పక్షులు,6)క్షీరదాలు.

$ భూమి మీద 5400 ల క్షీరద జాతులున్నాయి.

* కాకులను సహజ పారిశుధ్య  కార్మికులు అంటారు.

@ జంతువులు పరపోశకాలు

# అతి పెద్ద జంతువు నీలి తిమింగలం. ఇది 110-160 టన్నుల బరువు, 20-30 మీ పొడవు వుంటుంది.

$ జలగకు రక్తాన్ని పీల్చడానికి నోటిచుట్టు  చూషకాలు అనే అవయవాలు వుంటాయి.

* రాత్రి పూట ఆహారం సేకరించే జంతువులను నిశాచరులు అంటారు.

@ 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి.

# చీమలు హనీడ్యూ అనే పదార్తం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి.

$ చిరుతపులి 12-17 సంవత్సరాలు జీవిస్తుంది.

* ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగు పై ఆదారపడి వుంటుంది.

@ కొన్ని పదార్థాల గుండా చూసినపుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తే ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.

# నీటి సాంద్రత 1gr/మీ.లి.ఏదైనా ఒక వస్తువు నీటిపై తేలాలంటే నీటి సాంద్రత (1gr/మీ.లి.) కంటే తక్కువ వుండాలి.

$ మంచు గడ్డ స్పటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగావుండడం వల్ల నీటి పై తేలుతుంది

* క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది.

@ క్యాండేర్ అంటే మెరుపు అని అర్ధం.

Science bits

# బివ్యాక్స్ తో తయారు చేసిన కొవ్వ్యోత్తులు తీయటి వాసన కలిగివుండి తక్కువ పొగను యిస్తాయి.

$ పిల్లి రోజులో దాదాపు 14గంటలు నిద్రలో గడుపుతుంది.

*  షార్క్ చేప నోటిలో దాదాపు 4వేల దంతాలువుంటాయి.ఒక్కోదంతం 3మీ.మీ. పొడవు వుంటుంది.

@ ఒక జీవి యెక్క అవసరాలను తీర్చే పరిసరమే ఆ జీవి యెక్క ఆవాసము.

# ఆల్ఫైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు.

@ సముద్ర గర్భంలో మైల్లకొద్దీ వ్యాపించివుండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే.

$ ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్ళు తాగకుండా ఒంటెలకన్న  ఎక్కువ కాలం ఉండగలవు.

# మట్టినుంచి నీటిని వేరుచేసే పద్దతిని తెర్చడం అంటారు.

@ జోర్డాన్ దేశంలో వున్నా మృత సముద్రంలో నీటి మెడ మనం సులబంగా తెలియాడవచ్చు.

*  ఏదైనా పదార్థము నేరుగా ఘన రూపం నుంచి వాయురూపంలోకి లేదా వాయురూపం నుంచి ఘనరూపం లోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు.

@ దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు ఇది రాజస్తాన్లో వుంది.

# రంగులని వేరుచేసే పద్దతిని క్రోమటోగ్రఫి అంటారు.

$ బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు.

*  1823 సం. లో చార్లెస్ మేకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త  వర్షానికి తడవని బట్టలను తయారుచేసారు.

@ దూదినుంచి  గింజలను వేరుచేయదమును జిన్నింగ్ అంటారు.

# ప్లెక్సిల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ ను  వాల్డో.L సీమన్ అనే శాస్ర్తవేత్త కనుగొన్నాడు.

$ దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం (స్పిన్నింగ్) అంటారు.

* డా.మియోషి వోకమోటో అనే శాస్త్రవేత్త 1970 లో మొట్టమొదటి సుక్ష్మ దారం (మైక్రో పైబర్)ను తయారు చేసాడు.

@ విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు.

Science bits

@ ఒక పత్తి కాయ నుండి 500మీ. పొడవైన దారాన్ని తీయవచ్చు .

# ఆపిల్ బరువు లో 84% నీరు,దోస బరువులో 96% నీరు వుంటుంది

$ పుష్పంలో లైంగిక భాగాలు -అండాశయం ,కీలం ,కీలాగరం,పరాగాకోశం.వుంటాయి.

* నీరు ఆవిరి రూపం లో విడుదల కావడాన్నే భాష్పోత్సేకం అంటారు.

@ మిరపకాయలో కారం కలిగించే పదార్ధం కాప్సిసిన్ అంటారు.

# డైరీ పరిశ్రమలో భారి ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు.

$ పాలను పెరుగుగా మార్చే బాక్టిరియ-లక్టో బాసిల్లస్.

@ ఉష్ణోగ్రత పెరిగితే ఆ ప్రదేశం లో గాలి పీడనం తగ్గుతుంది.

# వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ ను వుపయోగించి వర్షం, మంచు, మొదలైన వాటి గురిచి తెలుసుకుంటారు.

$ వరదలు వచ్చినపుడు ప్రాజెక్టుల నుంచి విడుదలచేసే నీటి పరిమానాన్ని క్యూసేక్ లలో తెలియజేస్తారు క్యూసెక్ అనగా క్యూబిక్ సెం.మీ./సే.

@ థేల్స్ అఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త (క్రీ.పూ.624-546) స్థిర విద్యుత్ ను కనుగొన్నాడు.

# విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త (1544-1603) విద్యుత్ ను కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహంలాంటిదని దానికి హూమర్ అని  పేరు పెట్టాడు.

$ బెంజిమన్ ప్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త (1706 -1790) విద్యుత్ కు -,+ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు.

@ లూగి గాల్వాని అనే ఇటలి శాస్త్రవేత్త (1737 -1798) జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు.

# హన్స్ అయిర్ స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త (1777 -1851) విద్యుత్, ఆయస్కాంతంగా పని చేస్తుందని కనుగొన్నాడు.

$ మైఖేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త (1791-1867) మొట్టమొదటగా విద్యుత్ మోటార్ ను , విద్యుత్ జెనరేటర్ ను కనుకొన్నారు

@ థామస్ ఆల్వ ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్తాపించాడు.

# ప్రపంచంలో అతిపొడవైన వంతెన కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు 164.8 కి.మీ.

$ మోఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ,బిగాలలో కొలిచేవారు.

Science bits

@ 1957 ఏప్రిల్ 1న మనదేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతి గా స్వీకరించింది.

# విమానాలు,ఓడల వేగాన్ని నాట్ లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ 1.852 కి.మీ./గం. కు సమానం.

$ ఒక మైలు 1.61 కి.మీ. కు సమానం.

@ ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మద్య దూరాన్ని పారలాక్స్ యూనిట్ లలో కొలుస్తారు.

# ఒక మీటర్ లో 100,00,00,000 వంతును నానో మీటర్ అంటారు.

$ ఒక kg బియ్యం ఉత్పత్తి చేయడానికి 5000 లీ. నీరు అవసరం

@ వేగంగా పరుగెత్తే జంతువు చిరుతపులి.గంటకు 97 కి.మీ. పరుగెత్తును.

# నత్త సెకనుకు 0.013-0.028 మీ.వేగం తో చేలిస్తుంది.

$ ప్రపంచంలో దాదాపు 2700 జాతుల  పాములు జీవిస్తున్నాయి.

@ పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ దీని పొడవు 5.7 cm

# పక్షులలో కెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది.దీని బరువు 156kg.

$ మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్  ఇది తోడలో వుంటుంది.

Science bits

@ ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవిత కాలం లో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది.

# రెండు ఎముకలను కలిపే ప్రత్యేకమైన కండరపు తమ్తువులను లిగమెంట్లు అంటారు.

$ శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్ను పూసలు వుంటాయి. ఆ తర్వాతా చివర 9 వెన్నుపూసలలో 5 కలిసిపోయి ఒకటిగా మరియు 4 కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడుతాయి.

@ మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది.

@ మానవ శరీరం లో నీటి పై తెలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరిక లోని మిన్నెసోటా science మ్యూజియం పేర్కొన్నది.

# మానవుని పుర్రెలో 22 ఎముకలు వుంటాయి యివన్ని కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని క్రేనియం అని కూడా అంటారు.

@ మన శరీరం లో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి.

@ మనిషి, జిరాఫీ మెడలో 7 ఎముకలు వుంటాయి.

$ సూర్య కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకనుల సమయం పడుతుంది.

@ ప్రాథమిక వర్ణాలు- ఆకు పచ్చ ,ఎరుపు,నీలం. ఇవి వివిధ పాళ్ళలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి.

@ నీటి బిందువు గుండా సూర్య కాంతి ప్రయాణించి నపుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.

$ బల్బు వేలుగాదానికి ఉపయోగపడే విద్యుత్ లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది.

@ కాంతి సెకనుకు ౩లక్షల కి.మీ. వేగం తో ప్రయాణిస్తుంది.

@ కాంతి గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని దృశా శాస్త్రం అంటారు.

# భూమి నుంచి కాంతి చెంద్రున్ని చేరడానికి 1.255 సెకన్ల సమయం పడుతుంది.

@ సూర్య కాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది.

@ తెల్లని కాంతి లో 7రంగులు ఉంటాయి.

Science bits

@ ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది దీనినే పరావర్తనం అంటారు.

@ కలువగింజలు 300-400 సం. జీవించి వుంటాయి.

# అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపు 20-21 అడుగుల పొడవు 3000 kg బరువు వుంటుంది.

@ మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి వుండే కణాలు మెదడు కణాలు మాత్రమె.

@ కస్కూట (బంగారు తీగ) వంటి మొక్కలు ఆహారంకోసం ఇతర మొక్కల పై ఆడారపడతాయి.ఎటువంటి మొక్కలను పరాన్న మొక్కలు అంటారు.

$ మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కి.మీ. వేగంతో వస్తుంది.

@ కోడిగుడ్డు తెల్ల సోన లో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ వుంటుంది.

@ అట్లాంటిక్ జైంట్ స్వ్కిడ్ కన్ను 40cm వ్యాసార్ధం కలిగి ఉంటుంది.

# మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు చేయగలదు.

@ జున్ను తయారుచేయడంలో శిలింద్రాలను ఉపయోగిస్తారు.దీన్ని కిణ్వనం అంటారు.

@ మొక్కలకు ప్రాణం ఉందని జగదీశ్ చంద్రబోస్ చెప్పారు.

# క్రీ.శ.1590 లో డచ్ శాస్త్రవేత్త జకారాస్ జాన్సన్ అతని తండ్రి హేన్స్మైక్రోస్కోప్ ను కనుగొన్నారు.

 

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here