Teachers Rationalization తో డీఎస్సీ అభ్యర్థులకు లాభమా? నష్టమా?
తెలంగాణాలో ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ((Rationalization of teachers) ప్రక్రియను మొదలుపెట్టేందుకు సిద్ధమైంది.
దీనిపై ఈ రోజు సాయంత్రం వరకు జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతి యేటా విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుంది.
అయితే దీని వల్ల టీచర్ల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు లాభమా? నష్టమా? అనే విషయాలను తెలుసుకుందాం…
టీచర్ల రేషనలైజేన్ అంటే?
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే తెలంగాణా టెట్ పరీక్షను నిర్వహించింది. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉంది.
కానీ ముందుగా ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలనే అంశంపై స్పష్టత రావాలంటే ప్రస్తుతము ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎంతమంది టీచర్లు పాఠాలు బోధిస్తున్నారనే విషయం తెలియ వలసి ఉంది.
ఇందుకోసం ముందుగానే టీచర్లు ఎక్కువ ఉన్న దగ్గర విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న చోట టీచర్లు లేని స్కూళ్లను గుర్తిస్తారు.
ఆ తర్వాత ఆయా జిల్లాల యూనిట్ గా టీచర్లు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేస్తారు ఆ తర్వాత అవసరమున్న మేరకే ఖాళీలను భర్తీ చేపడతారు. ఇది రేషనలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
రేషనలైజేషన్ పోస్టులు తగ్గుతాయా?
రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా సీనియార్టీ ప్రకారం ఉద్యోగుల స్థాన చలనం ఉంటుంది.
అయితే ఇలాంటి ప్రక్రియ ద్వారా డీఎస్సీ తో భర్తీ చేసే పోస్టుల సంఖ్య తగ్గుతాయా? లేదా పెరుగుతాయా? అనే విషయం నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తుంది.
నిజానికి టీచర్లు ఉండి విద్యార్థులు లేని చోట టీచర్లను బదిలీ చేయకుండా అక్కడ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదవకపోవడానికి గల కారణాలు విశ్లేషించాలి.
ఆ ప్రాంతంలో తల్లిదండ్రులను మోటివేట్ చేసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే విధంగా ప్రోత్సహించాలి.
కానీ సర్కారు బడులను బలోపేతం చేయకుండా ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో బడులను మూసివేసే ప్రక్రియను చేపడుతుంది.
దీని వాళ్ళ కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు తగ్గడం, నిరుద్యోగులకు అన్యాయం జరగడం మరియు భావితరాల వారికి ప్రభుత్వ బడులు అందుబాటులో లేకుండా పోవడం జరుగుతుంది.
ఒకసారి ఏదైనా ఒక పాఠశాలను మూసివేస్తే మళ్లీ ఆ ప్రాంతంలో పాఠశాలని తెరవాలంటే కష్టమైన పనే.. దీంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ టీచర్ల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది.
ఈ విషయంపై టీచర్ సంఘాలు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకతను తెలియజేస్తున్న ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
నిరుద్యోగులకు లాభమా నష్టమా ?
పూర్తి సమాచారం కోసం క్రింది👇 లింక్ ఓపెన్ చేయండి.
TS SGT 👇సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోండి.
CTET SYLLABUS తెలుగులో డౌన్లోడ్ NOW👇
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |