Advertisements

Haven’t you written the CTET yet….

Haven't you written the CTET yet
Advertisements

Haven’t you written the CTET yet….

ఇప్పటి వరకు సీటెట్ రాయలేదా.. ఈ విషయాలు తెలుసుకోండి | CTET-2022

సీటెట్, సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ నియామకాల కోసం ఉద్దేశించిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్.

అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాల విద్యాసంస్థల్లో చేపట్టే ఉపాధ్యాయులను నియామకాలకు సీటెట్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు రంగ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే ప్రతి ఒక్కటెట్ పరీక్ష అర్హత తప్పనిసరి చేశారు.

ఆ చట్టం అమల్లో భాగంగా 2011 నుంచి టీచర్ ఎలిజిబులిటీ టెస్లను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నారు.

సీటెట్ పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ తో పాటు 20 భాషల్లో నిర్వహిస్తారు. ఇందులో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రాథమిక భాష ఒక సబ్జెక్టుగా ఉంటుంది.

అంటే తెలుగు రాష్ట్రాలకు తెలుగు భాష ఒక సబ్జెక్టుగా ఉంటుంది. మిగతా సబ్జెక్ట్ ప్రశ్నలు ఇంగ్లీష్ లో ఇస్తారు

సీటెట్ అర్హత-ప్రయోజనాలు

డీఈడీ, బీఈడీ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్ పరీక్షలో అర్హత సాధించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంగటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS),

సెంట్రల్ టిబెటన్ పాఠశాలలకు సీటెట్ లో అర్హత సాధిస్తేనే నియామక పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.

వీటితో పాటు చండీగఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ , అండమాన్, నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల ఆధ్వర్యంలోని నడిచే పాఠశాలలకు సీటెట్ స్కోరను పరిగణలోకి తీసుకుంటారు.

లక్షద్వీప్, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోని పాఠశాలలకు కూడా ఈ స్కోరు ఉపయోగపడుతుంది. అభ్యర్థులు అన్-ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

CTET- 2022 | డిసెంబర్ అటెంప్టు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది.

ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతులకు సంబంధించి ప్రైమరీ టీచర్లకు పేపర్-1, 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే టీచర్లకు పేపర్-2 ఉంటుది.

గతంలో సీటెట్ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానికి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇచ్చారు.

అర్హతలు:

సీటెట్-2022 పేపర్-1కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.

మరియు రెండేళ్ల డిప్లొమా(D.Ed) లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BEIEd) ఉత్తీర్ణులవ్వాలి.

ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పేపర్-2కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ +రెండేళ్ల డిప్లొమా(D.Ed) లేదా

ఒక సంవత్సరం BEd లేదా నాలుగు సంవత్సరాల BEIEdతో గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి.

సీటెట్ లో పాసవ్వాలంటే జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీలు, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

పరీక్షా విధానం:

పేపర్-1లో శిశువికాసం – అభివృద్ధి & బోధనాశాస్త్రం (Child Development And Pedagogy), లాంగ్వేజ్ I & II (ఇందులో తెలుగు సబ్జెక్ట్ ఎంచుకోవాలి.)

గణితశాస్త్రం, పరిసరాల విజ్ఞానం ఒక్కో సబ్జెక్టు నుంచి 30 మల్టిపుల్ ఛాయిస్ – క్వశన్లు అడుగుతారు. పేపర్- IIలో శిశువికాసం, బోధనాశాస్త్రం, లాంగ్వేజ్ – I, II వంటి ఒక్కో సబెక్ట్ నుంచి 30 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లతో

పాటు అభ్యర్థి డిగ్రీలో చదివిన సబ్జెక్ట్ అనుసరించి, గణితం, సైన్స్ లేదా సోషల్ స్టడీస్ నుండి 60 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు ఉంటాయి.

ఒక్కో పేపరకు మొత్తం 150 మార్కులుంటాయి. సీటెట్ 2021లో పరీక్ష జనవరి, డిసెంబర్‌లో రెండు సెషన్లలో జరిగింది.

మొదటి సెషన్లో పేపర్ 1లో 4.14 లక్షల మందికి 1.47 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

పేపర్ IIలో, 11 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు, అందులో కేవలం 2.29 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

డిసెంబర్ ప్రయత్నంలో 27.73 లక్షల మంది పరీక్షకు హాజరయ్యా రు. వారిలో 4,45,467 మంది అభ్యర్థులు పేపర్ | ని, 2,20,069 మంది పేపర్ || అర్హత సాధించారు.

తెలంగాణ అభ్యర్థులూ..

తెలంగాణాలో తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ కలిగి డీఈడీ, బీఈడీ పూర్తి చేసి అభ్యర్థులు దాదాపు 5లక్షలకు పైగా ఉన్నారు.

కానీ సీటెట్ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

ఇందుకు ప్రధాన కారణం ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష నిర్వహించడమే.. కానీ సీటెట్ పరీక్షలో ఇచ్చే లాంగ్వేజ్ చాలా సింపుల్ గా అర్థం చేసుకోగలిగే విధంగానే ఉంటుంది.

ఒకసారి పరీక్ష అటెంప్ట్ చేస్తే భయం వీడుతుంది.

కాబట్టి ప్రతి ఒక్కరూ సీటెట్ పరీక్ష రాసేందుకు ప్రయత్నించాలి. అర్హత సాధిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి.

పరీక్ష ఫీజు రూ.600 ఉంటుంది. సీటెట్-2022 నోటిఫికేషన్ పబ్లిక్ నోటిఫికేషన్ పీడీఎఫ్ ను కింద డౌన్లోడ్ చేసుకోండి..

 

నోటిఫికేషన్ కోసం కింద ఉన్న ఆరెంజ్ కలర్ లింక్ పై క్లిక్ చేయండి👇👇

CLICK HERE


సిలబస్ కోసం కింద ఉన్న ఆరెంజ్ కలర్ లింక్ పై క్లిక్ చేయండి👇👇

CLICK HERE


CTET వెబ్సైట్ కోసం కింద ఉన్న ఆరెంజ్ కలర్ లింక్ పై క్లిక్ చేయండి👇👇

CLICK HERE


ఈ సమాచారానికి మూలం పాలపిట్ట వెబ్సైట్

పూర్తి సమాచారానికి CLICK HERE

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

Haven’t you written the CTET yet