Advertisements

OUR COUNTRY – WORLD 5th EVS{ TEST-20 }

OUR COUNTRY - WORLD
OUR COUNTRY - WORLD
Advertisements

మన దేశం – ప్రపంచం

OUR COUNTRY - WORLD

OUR COUNTRY – WORLD

భారతదేశం

OUR COUNTRY – WORLD

భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.  భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, భారతదేశం వైశాల్యపరంగా ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. భారతదేశం మధ్యగా వింధ్య, సాత్పుర పర్వతాలు ఉన్నాయి. వింధ్యపర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశమని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశమని పిలుస్తారు.

ప్రపంచంలో అత్యంత ప్రాచీన దేశాలలో భారతదేశం ఒకటి. మన దేశానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అపారమైన జ్ఞాన సంపదకు నిలయమైన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలకు పుట్టినిల్లు మనదేశం.

శాంతిని బోధించే బౌద్ధ జైన మతాలు మనదేశంలోనే రూపుదిద్దుకున్నాయి. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతంజలి మొదలైన ఎందరో శాస్త్రవేత్తలు (ఋషులు) గణిత, ఖగోళ, యోగ, వైద్య విజ్ఞాన శాస్త్రాలలో ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఘన కీర్తి మనది. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు (రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652), వివిధ భూస్వరూపాలు, భిన్న సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనంతో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ “ఉపఖండం“గా ఖ్యాతి నొంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా విరాజిల్లుతోంది.

మీకు తెలుసా

రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలు మన దేశం కంటే వైశాల్యంలో పెద్దవి.

భారతదేశం – నైసర్గిక మండలాలు

మనదేశంలో భౌగోళికంగా ఆరు మండలాలు ఉన్నాయి. అవి:

1. తూర్పు భారతదేశం :-  బీహార్, జార్ఖండ్, ఒడిశా మరియు పశ్చిమబెంగాల్

2. పశ్చిమ భారతదేశం :- గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్

3. ఉత్తర భారతదేశం(ఉత్తరప్రదేశ్) :- జమ్ము & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ (దేశరాజధాని హోదా కల్గిన కేంద్రపాలిత ప్రాంతం)

4. దక్షిణ భారతదేశం :-  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ

5.ఈశాన్య రాష్ట్రాలు  :- అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం

6. మధ్య భారతదేశం :-  మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్.

ఖండాలు, మహాసముద్రాలు

దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మన సౌలభ్యం కోసం ఖండాలు, మహాసముద్రాలుగా విభజించుకున్నాం.

ఈ విశాల ప్రపంచ భూభాగాన్ని ఏడు ఖండాలుగా విభజించారు. అవి:

ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. ఖండాలలో అతి పెద్ద ఖండం ఆసియా. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా.

అన్ని ఖండాలలోను అక్కడక్కడ పర్వతాలున్నాయి. కొన్ని చోట్ల పీఠభూములు, మైదానాలు ఉన్నాయి. కొన్ని పర్వతాలు చాలా ఎత్తైనవిగాను (ఉదా: భారతదేశంలోని హిమాలయాలు, దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు) మరికొన్ని ఎత్తు తక్కువగాను (ఉదా: ఐరోపాలోని ఆల్మ్ పర్వతాలు) ఉన్నాయి.

సాధారణంగా పర్వత ప్రాంతాలు చాల చల్లగా ఉండి, వాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జనాభా తక్కువగా ఉంటుంది. పీఠభూములు పర్వతాల కన్న ఎత్తు తక్కువగాను, పైన ఇంచుమించు చదునుగాను, అంచులు ఎక్కువ ఏటవాలుగా ఉంటాయి.

పర్వత ప్రాంతాల కన్నా పీఠభూమి ప్రాంతాలలో జనాభా ఎక్కువ. మైదాన ప్రాంతాలు చదునుగా ఉంటాయి. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయపర్వతాలు ఉన్నాయి.

అవి మంచుతో కప్పి ఉంటాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమలయాలలోనే ఉంది. హిమాలయాలలో పుట్టిన గంగానది ఇండియా, నేపాల్ దేశాలలో ప్రవహిస్తుంది.

జలభాగం

భూమిపై విశాలమైన ఉప్పునీటి భాగములను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. ఇవి వివిధ ఆకృతులలోను, పరిమాణాలలోను ఉన్నాయి. అన్ని ఖండాల చుట్టూ మహాసముద్రాలు ఒకదానికొకటి కలపబడి ఉన్నాయి.

మహాసముద్రాలు ఐదు.

అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా మహాసముద్రం.

మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం.

అన్నివైపులా నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలను ‘ద్వీపాలు’ అంటారు. ఉదాహరణకు గ్రీన్‌లాండ్, గ్రేట్ బ్రిటన్లు.

మూడువైపులా నీరుండి, ఒక వైపు భూభాగాలతో కలిసి ఉన్న దానిని ‘ద్వీపకల్పం’ అంటారు.

మీకు తెలుసా

సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయేకొలది సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది.

భూమిపై భూభాగం కన్నా జల భాగమే ఎక్కువ. సుమారు 75% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంది. సూర్యకిరణాలలోని వేడివల్ల సముద్రపునీరు ఆవిరవుతుంది. ఈ ఆవిరైన నీరే ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారుతాయి. మేఘాలు మరింత చల్లబడి వర్షం కురుస్తుంది. ఇలా నిరంతరంగా జరిగే ప్రక్రియను ‘నీటిచక్రం‘ అంటారు. ఈ ప్రక్రియలో నీరు నీటి ఆవిరిగా మరల నీరుగా మారుతూ ఉంటుంది.

Water cycle

మీకు తెలుసా ?

మహాసముద్రాలలో కొన్ని ప్రదేశాలలో లోతైన గుంతలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని ప్రాంతాలు 10,000 మీటర్ల కన్న లోతైనవిగా… హిమాలయ పర్వతాలు కూడా ఈ సముద్రాలలో మునిగిపోయేంత గుంతలు ఉంటాయి. మహాసముద్రాల లోపల ఎత్తైన పర్వతశ్రేణులు కూడా ఉన్నాయి. ఈ పర్వతాలశాఖలు అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూమహాసముద్రాలలో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కి. మీ. ఇవి భూమిపైన అత్యంత పొడవైన పర్వతశ్రేణులు. కొన్ని పర్వత శిఖరాలు సముద్రం ఉపరితలంపైకి వ్యాపించి ఉండి దీవులుగా ఏర్పడ్డాయి.

Advertisements

మహాసముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. సముద్రజలాలలో అత్యధికంగా సోడియం క్లోరైడు (సాధారణ ఉప్పు) ఉంటుంది. సముద్రపు జలంలో సుమారు 96 శాతం నీరు ఉంటే మిగిలిన 4 శాతంలో లవణాలు, ఇతర కరగని ఘనపదార్థాలు ఉంటాయి. నదులలోని నీటికన్నా సముద్రపునీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది.
OUR COUNTRY – WORLD

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here