శక్తి
ENERGY
ENERGY
శక్తి వనరులు
శక్తి వనరులు వివిధ రకాలుగా లభిస్తున్నాయి. అవి సూర్యుడు, గాలి, నీరు, పెట్రోలు, డీజిలు, కిరోసిన్, గ్యాసు, బొగ్గు మొదలగునవి.
వీటిలో పెట్రోలు, డీజిలు, కిరోసిన్, గ్యాసు, బొగ్గు, నీరు మొదలగునవి శక్తి వనరులు వినియోగిస్తే ఖర్చయిపోతాయి.
గాలి, సూర్యుడు వంటి శక్తి వనరులు ఎంత ఉపయోగించుకొన్నా తరిగిపోవు. ఈ ప్రపంచానికి శక్తి అవసరాలు చాలా ఉన్నాయి.
తరిగిపోయే శక్తులు
పదార్థాలను మండిచడం ద్వారా వచ్చే శక్తే ఇంధనశక్తి. వంటచెరకు, బొగ్గు, కిరోసిన్, గ్యాసు, పెట్రోలు, డీజిలు మొదలైనవి ఇంధనాలు.
వీటిని మండించి వచ్చే శక్తితో విద్యుత్త యారీ, వాహనాలు నడపటం, పరిశ్రమలలో యంత్రాలను పనిచేయించటం, ఇళ్ళల్లో వంట చేసుకోవడం మొదలైన పనులు చేస్తారు.
ఈ ఇంధనాలను భూమి నుండి వెలికి తీస్తారు. లక్షల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు, జంతువులు భూమిలోపలకు చేరి ఇంధనాలుగా మారుతాయి.
ఈ విధంగా భూమిలో లభించే ఇంధనాలు అనగా పెట్రోలు, బొగ్గు, సహజవాయువును మనం బయటికి తీసి వాడుతున్నాం.
ప్రధానంగా వంటచెరకును వాడడం తగ్గించుకొని సహజవాయువును ఉపయోగించడం జరగాలి. సహజ వాయువును ఈ మధ్యకాలంలో పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని “గోబర్ గ్యాస్” అంటారు. వీటిని కూడా పొదుపుగా వాడాలి.
మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్తు, జలవిద్యుత్తు లేదా థర్మల్ విద్యుత్తు కేంద్రాలలో ఉత్పత్తి అవుతున్నది. దీనికి బొగ్గు, నీరు ప్రధానమైన వనరులు. విద్యుత్తును పొదుపుచేస్తే వీటిని కూడా పొదుపుచేసినట్లే. తరిగిపోయే శక్తివనరులను కాపాడడం మన బాధ్యత.
తరిగిపోని శక్తి వనరులు
కోట్ల సంవత్సరాల నుండి ప్రసరిస్తున్న సూర్యకిరణాలు, గాలి వంటి వనరులను మనం ఎంత వాడుకున్నా తరిగిపోవు. భూమి నుండి వెలికితీసే బొగ్గు, పెట్రోలు, డీజిలు, కిరోసిను, గ్యాసు వంటివి వాడుకున్న కొద్దీ తరిగిపోతుంటాయి.
సౌరశక్తి
మనం రోజూ బట్టలు ఆరవేయడానికి, ధాన్యం,చేపలు మొదలైనవి ఎండపెట్టడానికి సూర్యకిరణాలలోని శక్తిని ఉపయోగిస్తాం కదా! మరి, సౌరశక్తిని ఉపయోగించి కరెంటు (విద్యుత్తు)ను కూడా తయారుచేస్తారని మీకు తెలుసా?
మీకు తెలుసా ?
సూర్యకిరణాలు సౌరఫలకాలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్తును (కరెంటు) తయారుచేస్తాయి. ఆ విద్యుత్తును బ్యాటరీ నిలువ ఉంచుకుంటుంది. బ్యాటరీలో ఉన్న విద్యుత్తును అవసరమయినప్పుడు మనం వాడుకుంటాం. పగలు సూర్యరశ్మి ద్వారా తయారయ్యే విద్యుత్ బ్యాటరీలో నిల్వ ఉండి, రాత్రికి లైట్లు వెలగడానికి ఉపయోగపడుతుందన్నమాట.
మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. ఈ రాష్ట్రంలో పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌరశక్తితో పనిచేసే విద్యుత్తు ఉపకరణాలను వినియోగిస్తున్నారు. రేడియో, టెలివిజన్, కంప్యూటర్ వంటి వాటిని సౌరశక్తితోనే వినియోగిస్తారు.
పవనశక్తి
పవనం అనగా గాలి. మరి దీనికి శక్తి ఉందా? ఉందని ఎలా చెప్పగలరు? మన నిత్య జీవితంలో గాలితో ఉత్పత్తయ్యే శక్తిని ఏవిధంగా ఉపయోగించుకొంటున్నారో తెలుసా? ఆలోచించండి.
చిత్రంలో కనిపించే పెద్ద పెద్ద ఫ్యాన్లు గాలి వీచినప్పుడు తిరుగుతాయి. గాలికుండే శక్తివల్ల ఇవి తిరిగినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. బాగా గాలివీచే స్థలాలు అనగా కొండల పైన, సముద్రతీరాల్లో ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇలా గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్ ను ‘పవన విద్యుత్’ అంటారు. దీనిని లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలు పనిచేయడానికి ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాలల్లో గాలి మరలను బావుల నుండి నీరు తోడడానికి ఉపయోగిస్తారు.
నీటిశక్తి
సూర్యకాంతికి, గాలికి శక్తి ఉన్నట్లే నీటికి కూడా చాలా శక్తి ఉంది. ముఖ్యంగా విద్యుత్తు తయారీకి (జలవిద్యుత్తు) నీటిని ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్తును తయారుచేస్తారు. నీటివేగాన్ని ఉపయోగించి టర్బైను త్రిప్పడం ద్వారా విద్యుత్ తయారు అవుతుంది.
జలవిద్యుత్తు ఉత్పత్తి అయ్యే విధానం
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జలవిద్యుత్ ను తయారుచేస్తున్నాయి.
నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తునే జలవిద్యుత్తు అంటారు.
పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని “పెన్ స్టాక్” అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
ఈ విద్యుత్తును ట్రాన్స్ ఫార్మర్ల ద్వారా పవర్‌హౌస్ నుండి సరఫరా చేస్తారు. ఇలా నీటి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జలవిద్యుత్తు కేంద్రాలు” అంటారు.
భవిష్యత్తులో శక్తి వనరులు
పెట్రోలు, బొగ్గు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. కాబట్టి, భవిష్యత్తులో మనం వాడినా తరగని శక్తి వనరులపై ఆధారపడాలి. దానికోసం సౌరశక్తి, నీటిశక్తి, గాలిశక్తులను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ప్రయోగాలతో మంచి పద్ధతులను కనుక్కోవాలి. మీరు భవిష్యత్తులో దానికి ప్రయత్నించాలి. కింది పట్టికను పరిశీలించండి.
భవిష్యత్తులో శక్తి వనరులు
క్ర.సం | తరిగిపోయే శక్తివనరులు | తరిగిపోని శక్తివనరులు |
1 | పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గులు తరిగిపోయే శక్తివనరులకు ఉదాహరణలు | సౌరశక్తి, గాలిశక్తి, నీటి ఆ రిపోర్ శక్తివనరులకు ఉదా హరణలు |
2 | వీటికి ఖర్చు ఎక్కువ | వీటికి ఖర్చు తక్కువ |
3 | ఇవి కాలుష్య కారకాలు | ఇవి కాలుష్యరహితాలు |
4 | ఇవి ఎక్కువ కాలం లభించవు | ఇవి ఎప్పటికి లభిస్తాయి |
5 | వీటికి బదులుగా వేరే శక్తులను తయారు చేసుకోవడం అవసరం | ఇతర శక్తుల తయారీకన్నా వీటిని సక్రమ పద్ధతిలో అధికంగా వాడుకోవటం అవసరం |
శక్తుల సంరక్షణ
శక్తి అన్ని పనులకు అవసరం. ప్రకృతిలో లభించే వివిధ శక్తులను ఏవిధంగా ఉపయోగించాలో ఆలోచించాలి. శక్తుల సంరక్షణకు ప్రయత్నించాలి. కాలుష్యాన్ని తగ్గించాలి. ఇంధనాలను వృధా చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం నిలువ చేసుకోవాలి. తరిగిపోయే ఇంధనాల వాడకం తగ్గించి, తరగని ఇంధనాలను ఉపయోగించడం కోసం ప్రయత్నాలు చేయాలి.
ఇంధనాల పొదుపు ఎలా?
👉 తక్కువ దూరాలకు నడిచే వెళ్ళాలి. దాని ద్వారా ఇంధన పొదుపుతోపాటు, ఆరోగ్యానికి కూడా మంచిది.
🟠 కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లకు బదులుగా సైకిలును వాడాలి.
👉 సాధ్యమయినంతవరకు ‘ప్రజా రవాణా వ్యవస్థ’కి సంబంధించిన ఆర్.టి.సి. బస్సులు, రైళ్లలోనే ప్రయాణించాలి. ఒకరిద్దరి కోసం కారును వాడి ఇంధనాన్ని ఖర్చు చేయకూడదు. దీనివల్ల రోడ్లపై రద్దీ మరియు కాలుష్యం ఏర్పడతాయి.
🟢 పగటి వేళల్లో సూర్యరశ్మి వెలుతురులోనే పనులుచేసుకోవాలి. విద్యుత్తు లైట్లను వాడకూడదు. కిటికీలు, తలుపులు తెరచి ఉంచి వాటి ద్వారా గాలి, వెలుతురు వచ్చేటట్లు చూసుకోవాలి.
👉 ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, రాత్రివేళల్లో నిద్రించేటప్పుడు కరెంటు స్విచ్చులను ఆపివేయాలి. స్నానాల గదుల్లో, మరుగుదొడ్లలో లైట్లను వేసి ఉంచరాదు.
నీటిని వేడిచేసే గీజర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, మైక్రోవోవెన్లు, కరెంటు ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు, గైండర్లు వంటి విద్యుత్తుతో నడిచే గృహోపకరణాలు అత్యవసరమైతే తప్ప ఉపయోగించకూడదు.
🟡 చల్లదనం కోసం సాధ్యమయినంత వరకు మనం ప్రకృతిలోని గాలిని ఉపయోగించుకోవాలి. అవసరమయినప్పుడే ఫ్యాన్లు వాడాలి. ఇంటి చుట్టూ మొక్కలు, చెట్లను పెంచితే ఏ.సి అవసరం ఉండదు.
👉 అనవసరంగా కట్టెలు, బొగ్గు మండించకూడదు. ఆకులు, చెత్త మొదలైన వాటిని కంపోస్టుగా తయారుచేయాలి. అంతేకాని కాలుష్యం కలిగేటట్లు తగలబెట్టకూడదు.
🔵 నీటిని వృధా చేయకూడదు. పొదుపుగా వాడాలి.
👉 మనకు ఆహారం ద్వారా శక్తి లభిస్తుంది. ఆహార పదార్థాలను వృధా చేయకూడదు. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించకూడదు. ఎందుకనగా ఎక్కువగా ఉడికించడానికి ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అట్లే పోషకపదార్థాలు కూడా నశిస్తాయి.
ENERGY
ENERGY
5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here