Advertisements

CHILD RIGHTS 5th EVS { TEST 22 } బాలల హక్కులు

CHILD RIGHTS
CHILD RIGHTS
Advertisements

బాలల హక్కులు

CHILD RIGHTS

CHILD RIGHTS

CHILD RIGHTS

నేటి బాలలు భావి భారత పౌరులు. నేటి పిల్లలే రేపటి పెద్దలు. రేపటి సమాజం బాలల పైనే ఆధారపడిఉంటుంది. బాలలవి ఎల్లలులేని ఆలోచనలు. భారత రాజ్యాంగం ప్రతి  పౌరునికి కొన్ని హక్కులను ఇచ్చింది. అలాగే బాలలకు అనేక హక్కులు ఉన్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారు, సమాజం బాలలపట్ల ప్రేమతో, దయతో ఉండాలి. వారి అభివృద్ధి కొరకు ఆలోచించాలి.

జీవితంలో బాలలు బాగా ఎదగాలని, అందరితో గుర్తింపు పొందాలని పెద్దలు అనుకుంటారు. అందుకొరకు ఎనలేని శ్రద్ధతో వారి అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. కాని అదంతా సమంజసమేనా? పిల్లల అభివృద్ధి అని చేసే పనులన్నీ అంగీకారయోగ్యమేనా? బాలలందరికి విద్య, మెరుగైన జీవన స్థితి, వినోదం, ఆటపాటలలో స్వేచ్ఛగా పాల్గొనడం, దోపిడి నుండి రక్షణ, అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చడం అనే హక్కులు కల్పించబడ్డాయి.

మీకు తెలుసా?

హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయస్సులో విషజ్వరం వచ్చి కంటిచూపు, నోటిమాట పోయాయి. వినికిడి శక్తి కూడా కోల్పోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు నిరాశకు లోనుకాలేదు. ఇలాంటి అమ్మాయి పుట్టిందని తిట్టలేదు. ఆమె జీవితం బాగుండాలని అనేక విధాలుగా ప్రయత్నించారు హెలెన్ కెలర్ 8 సం||ల వయస్సులో బైలీ లిపి నేర్చుకొంది. సారాపుట్టర్ అనే ఉపాధ్యాయిని పర్యవేక్షణలో  నెమ్మదిగా మాట్లాడటం నేర్చుకొంది. మాట్లాడేవారి పెదవులపై, కంఠం పై వేళుంచి భాషను నేర్చుకొంది. 33 సం||ల వయసు నుండి ‘ప్రత్యేక అవసరాలు గలవారి’ గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది. భారత దేశంలోని తల్లిదండ్రులు ఆమెను చూసి శరణాలయాల నుండి వారి పిల్లలను ఇంటికి తెచ్చుకున్నారు. 88 సం||ల వయస్సులో చనిపోయిన హెలెన్ కెల్లర్ ఎంతో మందిలో అనేక రకాలుగా స్ఫూర్తి నింపింది. బాలలందరు ఆనందంగా, ఆరోగ్యంగా పెరిగి మంచి పౌరులయి భారతదేశ అభివృద్ధికి, కీర్తికి పాటుపడాలి. దీనికి ప్రపంచదేశాలతోసహా మనదేశం కూడా బాలలకు కొన్ని హక్కులు కల్పించింది. మరి ఈ హక్కులేమిటో ఏయే హక్కులు మీరు పొందుతున్నారో తెలుసుకుందాం.

బాలల హక్కులు

CHILD RIGHTS

బాలలకు ప్రధానంగా నాలుగు హక్కులున్నాయి. అవి.

1. జీవించే హక్కు (Right to Surrival)

2. రక్షణ పొందే హక్కు (Right to Protection) )

3. అభివృద్ధి చెందేహక్కు (Right to Development)

4. భాగస్వామ్య ( పాల్గొనే ) హక్కు (Right to Participation)

పై వాటిలో భాగంగా అనేక హక్కులు బాలలు కలిగి ఉంటారు.

బాలల హక్కులను పరిశీలించండి.

CHILD RIGHTS

~ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు

@ పరిశుభ్రమైన తాగునీటి హక్కు

# తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే హక్కు

$ సంఘంగా నిర్వహించుకునే హక్కు

% కోరుకున్న పేరు కలిగి ఉండే హక్కు

* పోషకాహారం పొందే హక్కు

~ జీవించే హక్కు

@ లైంగిక (మానసిక, శారీరక) వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు

# జాతీయతని కలిగి ఉండే హక్కు

$ సామాజిక భద్రత పొందే హక్కు

% వినోదం పొందే హక్కు

* నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు

~ విశ్రాంతి పొందే హక్కు

@ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే హక్కు

# ప్రేమ, ఆప్యాయతలను పొందే హక్కు

$ ఆడుకునే హక్కు

% శారీరక, ఆర్థిక దోపిడి నుండి విముక్తి పొందే హక్కు

* అవమానం నుండి రక్షణ పొందే హక్కు

~ ప్రశంసలు పొందే హక్కు

@ భావవ్యక్తీకరణ హక్కు

# మనిషిగా గుర్తింపు పొందే హక్కు

$ హింస నుండి రక్షణ పొందే హక్కు

% అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు

* గౌరవాన్ని పొందే హక్కు

~ యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు

@ సమాచారం పొందే హక్కు

# స్వేచ్ఛగా ఆలోచించే హక్కు

$ ప్రేమ, స్నేహాన్ని కలిగి ఉండే హక్కు

% మతస్వాతంత్ర్యపు హక్కు

* ఆత్మసాక్షిగా ప్రవర్తించే హక్కు

~ సామాజిక సమానత్వపు హక్కు

@ వివక్షతల నుండి విముక్తి పొందే హక్కు

ఇంట్లో ఏం జరగాలి?

పిల్లలను పనిచేసేవారిగా, డబ్బు సంపాదించే వనరుగా, చెప్పిన పనులు చేయవలసిన వారుగా, పెట్టిన ఆహారం తినేవారుగా, పెద్దల అభిప్రాయాలకు అనుగుణంగా పెరిగే వారుగా కాకుండా బాలల హక్కులను గుర్తించి వ్యవహరించాలి. స్వేచ్ఛా వాతావరణం ఉండాలి. పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి. వారి గురించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారితో చర్చించాలి. వారి ఇష్టా ఇష్టాలను తెలుసుకోవాలి. ఖచ్చితంగా బడికి పంపాలి. లక్ష్యాలు నిర్దేశించరాదు. క్రమశిక్షణ పేరుతో శిక్షించరాదు. ఇంకా ఏం చేయాలో రాయండి.

 పాఠశాలలో ఏం జరగాలి?

ఇంటిపని చేయలేదని, చదవడం, రాయడం రాదని, మొదటి స్థానం పొందలేదని శారీరకంగా, మానసికంగా హింసించడం బాలల హక్కు ప్రకారంగా నేరం. శారీరకంగా, మానసికంగా హింసించరాదు. పేర్లతో పిలవాలి. తిట్టరాదు. కలుపుగోలుగా ఉండాలి. అభివృద్ధికరమైన వాతావరణం ఉండాలి. ఇంకా ఏం చేయాలో రాయండి.

సమాజంలో ఏం జరగాలి?

రేపటి పౌరులని సమాజం గుర్తించాలి. పౌరులకు హక్కులు ఉన్నట్లుగా బాలలకు కూడా హక్కులు ఉన్నాయని గుర్తించి పాటించాలి. అమలుచేయాలి. అన్ని అంశాలలో వారికి ప్రాధాన్యతనివ్వాలి. ఎదుగుతున్నవారిగా గుర్తించాలి. సమాన అవకాశాలు ఇవ్వాలి. పిల్లలు గౌరవంగా చూడబడాలి. వారి అభిప్రాయాలకు విలువనివ్వాలి.

బాలల హక్కులు అన్ని చోట్లా పరిరక్షించబడాలి. ఇంట్లో, బడిలో, తాను పాల్గొనే అన్నిచోట్లా, సమాజంలో ఎక్కడైనా బాలల హక్కులు పరిరక్షించబడాలి. బాలలు తమ హక్కులపట్ల అవగాహన కలిగి ఉండి తమ హక్కుల రక్షణ కొరకు కృషిచేయాలి. పెద్దలు బాలల హక్కులను గుర్తించి నడుచుకోవాలి.

బాలల పార్లమెంటు

సుమారు 6 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న 30 మంది బాల బాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంటు. ఇందులో ఆ ఆవాస ప్రాంతంలోని బాలలు సభ్యులుగా ఉంటారు. బాలల పార్లమెంటు విద్య, ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించాలి. బాలల హక్కుల పరిరక్షణకు కృషిచేసి, అందుకు కృషి చేస్తున్న సంస్థలతో కలిసి పనిచేయాలి. కేరళలో 2,722 బాలల పార్లమెంటులలో 6 లక్షల మంది బాలలు సభ్యులుగా ఉన్నారు.

ప్రపంచం మొత్తంలో వెట్టిచాకిరి చేస్తున్న బాలల గురించి మరియు హక్కులు కోల్పోయిన ఆ బాలల గురించి ఆలోచించండి. అలాంటి బాలలకు న్యాయం జరిగేటట్లుగా మీరేం చేయగలరో ఆలోచించండి. కార్యక్రమాల రూపకల్పనలో పాల్గొనండి. అందరం కలిసి బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడదాం. బాలల హక్కుల పరిరక్షణలో విజయం సాధిస్తామనే విశ్వాసంతో పనిచేద్దాం.

బాలలకు హక్కుల పరిరక్షణకు ఎవరు సహకరిస్తారు

బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం

బాలలను శారీరకంగా, మానసికంగా హింసించినా బాలల హక్కులకు భంగం కలిగించినా బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం వారు తగిన చర్యలు తీసుకుంటారు. బాలలకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు. ఫీజుల వసూలు, చదవలేదని, ఇంటిపని చేయలేదని శిక్షించడం చట్ట ప్రకారం నేరం. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే 18004253525 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు చెబితే తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఉచిత సర్వీసు. ఇది హైద్రాబాద్ లోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉంది.

 బాలల హక్కుల పరిరక్షణ క్లబ్

ప్రతి పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణ క్లబు ఏర్పాటుచేయాలి. ఇందులో బాలలు సభ్యులుగా ఉంటారు. బాలల హక్కుల పరిరక్షణకు ఈ క్లబ్ కృషిచేయాలి. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్ష చేయాలి. బాలల హక్కులకు భంగం కలగకుండా చూడడం, బాలల అవసరాలు తీర్చడం ఈ క్లబ్ చేయవలసిన పనులలో ముఖ్యమైనవి.

బాలలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆటలు ఆడుకోవాలి. నిర్భయంగా ప్రశ్నించి విషయాలు తెలుసుకోవాలి. అన్నింట్లో పాల్గొనాలి. ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి. తోటి బాలల హక్కులను గౌరవించాలి. స్వేచ్ఛగా వ్యవహరించాలి.

పిల్లల కోసం ప్రత్యేకమైన సహాయకేంద్రం – చైల్డ్ లైన్

ఎవరికోసం?

బాల కార్మికులు, వీధి బాలలు, వివక్షతకు గురి అయిన వారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు, బాల్య వివాహ బాధితులు, హెచ్.ఐ.వి./ఎయిడ్స్ వివాహ బాధితులు, హెచ్.ఐ.వి./ఎయిడ్స్ తదితర బాధిత బాలల కోసం.

ఎలా పనిచేస్తుంది :

సహాయం అవసరం అయిన బాలలు లేదా బాలల కోసం ఎవరైనా 1098 అనే ఉచిత నెంబర్ కి ఫోన్ చేస్తే వారు జిల్లా కేంద్రంలో ఉన్న చైల్డ్ లైన్ సిబ్బందికి సమాచారం అందిస్తారు. వారు వెంటనే స్పందించి సమస్య ఉన్న ప్రదేశానికి చేరుకొని బాలల కోసం తక్షణ చర్యలు చేపడతారు. అవకాశం ఉంటే వారిని తల్లిదండ్రులు లేదా బంధువుల దగ్గరికి చేరుస్తారు. లేకపోతే బాలల పునరావాస కేంద్రాలకు పంపించి, ఉచితంగా వసతి కల్పించి చదువు చెప్పిస్తారు. బాలలు లైంగిక వేధింపులకు గురి కాకుండా భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టం-2012 (POCSO) రూపొందించింది. బాలలను లైంగిక వేధింపుల నుండి కాపాడి తగు న్యాయం అందించుటకు 1098 ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది.

CHILD RIGHTS

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు 


Click Here