TET మరియు DSC కోసం ప్రిపేర్ అవుతున్న వల్ల కోసం, TET Coaching తీసుకోవాలనుకున్న వారి కోసం, tet online practice exam in telugu అని వెతికే వారి కోసం, నేను ఈ క్రింది విధంగా PRACTICE BITS అందిస్తున్నాను.RIVERS – MEANS OF LIVELIHOOD
RIVERS – MEANS OF LIVELIHOOD
ఈ పాఠం లోని కొన్ని అంశాలు.
బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం
భారతదేశంలో గల రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా రెండవది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా లో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడినది. ఇది హైదరాబాద్కు 205 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం లో ముఖ్యమైన ఉత్సవాలు గా వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసం వేడుకగా జరుపుకుంటారు. అమ్మవారిని చదువుల తల్లిగా కొలుస్తారు.
ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, భద్రాచలంలో రామాలయం, మంథనిలో గౌతమేశ్వర దేవాలయం ఇవన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. గోదావరి నదికి ప్రతి పన్నెండేళ్లకు పుష్కరాలు వస్తాయి. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలలో నదీ స్నానం చేయడం హిందువులు పవిత్రంగా భావిస్తారు. కొయ్యబొమ్మలకు నిలయమైన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలోనే ఉంది.
పరిశ్రమలు కాలుష్యం
గోదావరి నీటి పై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిశాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2,600 వందలు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నది. భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విజ్జేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. గోదావరి తీరంలోని నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఫలితంగా నదిలో జలచరాలకు హాని కలుగుతుంది. నదిలోని నీరు కాలుష్యానికి గురవుతుంది.
RIVERS – MEANS OF LIVELIHOOD
టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.
- మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
- అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
- తరువాత NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
- చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
- Click text button below
- Read the questions and all options carefully and select your answer
- After every question click on next button
- Exam click on finish the text
- After completion of your exam to know right answer click on See Result