Advertisements
నది – జీవనవిధానం !
TET మరియు TRT
ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.
పార్ట్ 1
నది – జీవనవిధానం
నది-జీవనవిధానం పాఠంలోని ముఖ్యమైన అంశాలు
గోదావరి నది
గోదావరి నది మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమయింది. మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా లోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. సుమారు 1465 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. మన రాష్ట్రంలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తుంది. గోదావరి నది నిర్మల్ – జగిత్యాల, నిర్మల్ – నిజామాబాద్, మంచిర్యాల – జగిత్యాల మరియు మంచిర్యాల – పెద్దపల్లి జిల్లాలను వేరు చేస్తున్నది. ఇది మూడు పాయలుగా విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నది-జీవనవిధానం
మత్స్యకారులు
గోదావరి నదిలో చేపలు పట్టడం పై ఆధారపడి లక్షలాదిమంది జీవిస్తున్నారు. రకరకాల చేపలు, రొయ్యలు, పీతలను వల వేసి పడతారు. ఎంతో నైపుణ్యంతో శ్రమించినప్పుడే చేపలు దొరుకుతాయి.
నదీ రవాణా
గోదావరి నది మత్స్యకారుల తోపాటు ఇంకెంతో మంది ఉపాధికి తోడ్పడుతుంది. చేపలు పట్టే వారితోపాటు పడవ నడిపే వారు కూడా జీవిస్తున్నారు. భద్రాచలం – పేరంటాలపల్లి మధ్య పాపి కొండల నడుమ గోదావరి నది లో వేల మంది పర్యాటకులు లాంచీల లో విహారం చేస్తూ ఉంటారు. తెలంగాణ టూరిజం శాఖ వారు బ్రాంచీలను గోదావరిపై నడుపుతున్నారు.
ఆనకట్టలు – పంటలు
గోదావరి నదిపై మొదటి డ్యాం గంగాపురం వద్ద ఉంది. ఇది నాసిక్ , త్రయంబక్ పట్టణాల ప్రజలకు త్రాగునీరు అందిస్తుంది. గోదావరిపై జాయక్ వాడి, శ్రీరాంసాగర్, ధవలేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఇవి లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నాయి.
నదులు – నాగరికతలు
తొలి రోజుల్లో మానవులకు ముఖ్యమైన జీవన వనరుగా నదులు ఉపయోగపడ్డాయి. నదుల తీరంలో మానవ సమూహాలు వృద్ధి చెంది గ్రామాలు, పురాతన నగరాలు వెలిశాయి.
గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా కళలకు నిలయంగా విలసిల్లుతున్నది. నాసిక్ ప్రముఖ ‘కుంభమేళ’ కేంద్రం. త్రయంబకేశ్వర్ ద్వాదశ ‘జ్యోతిర్లింగాలలో’ ఒకటి. నాందేడ్ ప్రఖ్యాత ‘సచ్ ఖండ్’ గురుద్వారా ఉంది. మన రాష్ట్రంలో బాసరలోని ప్రసిద్ధ ‘జ్ఞాన సరస్వతి’ దేవాలయం ఉన్నది.
టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.
- మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
- అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
- తరువాత NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
- చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
- Click text button below
- Read the questions and all options carefully and select your answer
- After every question click on next button
- Exam click on finish the text
- After completion of your exam to know right answer click on See Result
501