Advertisements

5వ తరగతి EVS | 2. వ్యవసాయం పంటలు ! Bits

Advertisements

2. వ్యవసాయం పంటలు

Bits

Agriculture crops

 

Agriculture crops

1. రైతులు విత్తనాలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే పద్ధతిని ‘నాగులు’ అంటారు

2. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకూ దాదాపు ‘5400’ రకాల వరి వంగడాలు ఉండేవి.

3. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకూ దాదాపు ‘740’  మామిడి రకాలు ఉండేవి.

4. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ‘3500’ వంకాయ రకాలు ఉండేవి.

5. మన దేశంలో ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్’ అనే సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది.

6. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడానికి ‘అంతర పంటలు’ అంటారు.

7. ‘వానపాముల’ సహాయంతో వర్మి కంపోస్టు ఎరువును తయారు చేస్తారు.

8. పంచగవ్య అనే ఎరువు ‘ద్రవ రూపంలో’ ఉంటుంది.

9. పంచగవ్య లో వాడే పదార్థాలు ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, బెల్లం, నీరు.

10. జీవామృతం లో ఉండే పదార్థాలు ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు.

11. కోళ్ల ఫారంలో గుడ్ల కొరకు పెంచే కోళ్లను ‘లేయర్లు’ అంటారు.

12. కోళ్ల ఫారంలో మాంసం కొరకు పెంచే కోళ్లను ‘బ్రాయిలర్’ లు అంటారు.

13. కందులను ‘తొగాళ్ళు’ అని కూడా అంటారు.

14. తయిదలను ‘రాగులు’ అని కూడా అంటారు.

15. బొబ్బర్ల ను ‘అలసందలు’ అని కూడా అంటారు.

16. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ‘దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’ జీవవైవిధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది.

17. ఐ ఆర్ 20, హంస, స్వర్ణ, మసూరి, బంగారుతీగ, సాంబ, ఇవన్నీ వరి రకాలు.

18. ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి, ఇవన్నీ కంది పంటల రకాలు.

Agriculture crops

మీకు తెలుసా

ఒకే చోట ఒకే కాలంలో లో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడానికి “అంతర పంటలు” అంటారు.

మీకు తెలుసా

మన రాష్ట్రంలో  కొన్ని అన్ని దశాబ్దాల క్రితం వరకూ దాదాపు ఐదు వేల నాలుగు వందలు(5400)  రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3500 వంకాయ రకాలు ఉండేవి. సాంప్రదాయ వంటలు పంటల విత్తనాలు (జీవ పదార్థాలను) భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాలు కనుమరుగయ్యాయి.

మనదేశంలో “నేషనల్ బ్యూరో ఆప్ ప్లాంట్ జెనెటిక్స్” సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది.

పంటలు రకాలు

మన రాష్ట్రంలో రకరకాల పంటలు పండుతాయి. గోధుమ, వరి, మొక్కజొన్న, జొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి పండుతాయి. వీటిని “ఆహార పంటలు” అంటారు. వీటితో పాటు పత్తి, జనుము, మిర్చి వంటివి కూడా పండుతాయి. వీటిని “వాణిజ్య పంటలు” అంటారు.

 

పైన ఉన్న బిట్స్ ప్రశ్నలు ప్రాక్టిసు చేయాలంటే ఇక్కడ నొక్కండి. Click Here.

 

👉To Join Our Telegram group

CLICK HERE

👉To Join Our Whatsapp group

CLICK HERE

👉To Subscribe Our youtube channel

CLICK HERE