Advertisements

Academic Schedule అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ

Advertisements

 అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ

Academic Schedule

అకడమిక్‌ షెడ్యూల్‌ (Academic Schedule)ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ

1-2 రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్ర!

👉May 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఖరారు చేసింది…

కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రాలకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించడం జరుగును.

February  1st తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్‌ను తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది.

ప్రభుత్వం 1, 2 రోజుల్లో ఆమోద తెలిపే అవకాశం ఉంది…

అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే Academic schedule ‌ను ఖరారు చేసింది.

మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తావించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్‌లైన్‌/ డిజిటల్‌ విధానంలోనే బోధనను కొనసాగించి, విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది..

అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తరువాత

6వ తరగతి,

7వ తరగతి,

8వ తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం చివరి  నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

💥మొత్తం 204 పనిదినాలు💥

👉మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు… అందులో గత సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌/డిజిటల్‌ పద్ధతిలో 115 రోజులు అవుతాయి.

👉ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 89 రోజుల పని దినాలు ఉంటాయి.

👉ఈ రోజుల్లో ప్రత్యక్ష విద్యా బోధనతో పాటు ఆన్‌లైన్‌/డిజిటల్‌ విద్యా బోధన కొనసాగుతుంది.

👉February లో  24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మేలో 19 పని దినాలు ఉంటాయి.

💥ఉదయం 9.30 నుంచి బడి💥

👉పాఠశాలలు ఉదయం 9:30AM గంటల నుంచి సాయంత్రం 4:45pm ల వరకు ఉంటాయి.

Hyderabad, Secunderabad ‌ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి.

డిజిటల్‌ బోధన పదో తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (2 పీరియడ్లు) ఉంటుంది.

9వ తరగతికి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు (2 పీరియడ్లు) ఉంటాయి.

👉70 % సిలబస్‌నే టీచర్లు ప్రత్యక్ష బోధనతోపాటు, ఆన్‌లైన్‌/డిజిటల్‌ విధానంలో బోధిస్తారు.

👉 మిగతా 30 % సిలబస్‌ ప్రాజెక్టు వర్క్స్, అసైన్‌మెంట్లకే ఉంటుంది. వాటిని ఇంటర్నల్‌ అసెస్‌మెంట్స్, SA( summative assessment)/‌Board పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరు.

💥ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు💥

👉ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదు. ఇంటినుంచే చదువుకుంటామంటే తల్లిదండ్రుల అంగీకారంతో అనుమతించాలి.

👉కనీస హాజరును పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలి.

👉 ఏ ఒక్క విద్యార్థినీ ఏ కారణంతోనూ పరీక్షల నుంచి విత్‌హెల్డ్‌లో పెట్టడానికి వీల్లేదు..

విద్యార్థుల ఆరోగ్య ప్రణాళిక

– పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ముందే School‌ management ‌ committee తో సమావేశం నిర్వహించాలి…

Covid‌ జాగ్రత్తలు,

రోగనిరోధకత పెంపు,

మానసిక ఆరోగ్యం,

పరిశుభ్రత,మరియు

భౌతిక దూరం పాటించడం

తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి…

👉- విద్యార్థులకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి Isolation rooms ఏర్పాటు చేయాలి.

👉విద్యార్థులకు ఎవరికైనా covid ‌ లక్షణాలు ఉంటే వారి తల్లిదండ్రులకు తెలియజేసి, తగిన జాగ్రత్తలతో ఇళ్లకు పంపేందుకు రవాణా సదుపాయం కల్పించాలి…

ఇవీ అకడమిక్‌ క్యాలండర్‌లోని ప్రధాన అంశాలు:

ఫిబ్రవరి 1: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం

మే 26 : చివరి పని దినం.

💥పరీక్షల షెడ్యూల్💥‌

👉మార్చి 15 లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్ష

👉ఏప్రిల్‌ 15 లోగా: ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్ష

👉మే 7 – మే 13 : 9వ తరగతికి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (Summative Assesment) పరీక్షలు

👉మే 17 – మే 26 : పదో తరగతి పరీక్షలు..

మే 27 – జూన్‌ 13 :  వేసవి సెలవులు.

(మార్చి/ఏప్రిల్‌లో సైన్స్‌ సెమినార్లు, ఎగ్జిబిషన్లను వర్చువల్‌గానే నిర్వహించాలి)

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here