Advertisements

SBI లో Account ఉందా? ఇక charges తడిసిమోపేడే!

Advertisements

 Is there account in sbi? The more charges, the more expensive they are!

 SBI లో ఖాతా ఉందా? ఇక చార్జీలు త‌డిసిమోపెడే!

account in sbi

జూలై 1 వ తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది.

 

👉 దేశంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌.. భార‌తీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు నిరాశ క‌లిగించే విష‌యం ఒక‌టి బ‌య‌ట‌పెట్టింది.

 

 👉బేసిక్‌ సేవింగ్స్‌ అంటే జీరో బ్యాలెన్స్‌ ఖాతా (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD) కల‌వారి నుంచి వ‌చ్చే జూలై ఒక‌టో తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది.

 

👉నగదు ఉపసంహరణ, చెక్‌బుక్‌పై పరిమితులు విధించామ‌న్న‌ది. 

 

👉ఆ పరిధి దాటితే రుసుముల(charges) వ‌సూళ్లు వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.

 

👉ఏదేనీ SBI  శాఖ‌లోగానీ, ATM లోగానీ మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రాయ‌ల్‌కు అనుమతి ఇచ్చింది. 

 

👉అంతకంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవాలనుకుంటే.. ప్రతిసారి రూ.15లతో పాటు GST అదనంగా చెల్లించాలి.

 

👉ఇతర బ్యాంకుల‌ ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. 

 

👉ఇకపై SBI ఖాతాదారులు ఎస్బీఐయేతర ఏటీఎంలు, SBI శాఖ‌తో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

 

👉ఇక BSBD ఖాతాదారుల‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లీవ్స్‌తో కూడిన చెక్‌బుక్‌ను ఎస్బీఐ ఉచితంగా అందజేస్తుంది. 

 

👉అంతకంటే ఎక్కువ లీవ్స్ గ‌ల చెక్ బుక్ కావాలంటే అద‌న‌పు చార్జీలు చెల్లించాల్సిందే. 

 

👉10 లీవ్స్ కల చెక్‌బుక్‌కు రూ.40లతోపాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలి.

 

👉ఒకవేళ 25(ఇరవై ఐదు) చెక్‌ లీవ్స్ కలిగిన బుక్‌ కావాలంటే జీఎస్టీతో పాటు రూ.75 కట్టాలి.

 

 👉ఒకవేళ అత్యవసరంగా చెక్‌ బుక్ కావాలని కోరితే.. 10 లీవ్స్‌కి రూ.50+జీఎస్టీ చెల్లించాలి. 

 

👉అయితే, సీనియర్‌ సిటిజన్లకు మాత్రం చెక్‌ బుక్‌ ఛార్జీలు వర్తించబోవ‌ని SBI వెల్ల‌డించింది.

 

  1. account in sbi

 

👉To Join Our Telegram group

CLICK HERE

👉To Join Our Whatsapp group

CLICK HERE

👉To Subscribe Our youtube channel

CLICK HERE