ANIMALS – THE BASE OF OUR LIFE
జంతువులు – మన జీవనాధారం
ANIMALS – THE BASE OF OUR LIFE
1. జంతువులు – మన జీవనాధారం
1. మనదేశంలో లో ఎక్కువగా ఒంటెలు రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటాయి.
2. కుక్కలు గొర్రెల మందను నక్కలు, తోడేళ్ళు బారినుండి కాపాడతాయి.
3. వానపాము వలన నేల గుల్లబారి మొక్క యొక్క వేర్లకు బాగా గాలి తగిలి మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది.
4. పాము, వానపాము , సాలెపురుగు, చీమ ,వీటన్నింటిని రైతులకు నేస్తాలు అని అంటారు.
5. ఐ. సి. ఎ. ఆర్ అంటే జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి.
6. టైక్రోగ్రామ్ ను ఐ సి ఏ ఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తయారు చేశారు.
7. టైక్రోగ్రామ్ జీవితకాలం 7 రోజులు (వారం రోజులు) మాత్రమే.
8. గిరిజనులు విసనకర్రను రాలిన నెమలి ఈకలతో తయారుచేసి సంతలో అమ్ముతారు.
9. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
10. వన్యప్రాణి (రక్షణ) చట్టం 1971 సంవత్సరం.
11. వన్యప్రాణి చట్టం 1971 లోని షెడ్యూలు 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడటం విక్రయించటం నేరం.
12. ఒకవేళ ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
13. రాబందు 2 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.
14. రాబందు యొక్క ఆచూకీ తెలిపితే తెలంగాణ జీవ వైవిధ్య మండలి రెండు లక్షల వరకు బహుమతి అందిస్తామని ప్రకటించడం జరిగింది.
15. పులి, బట్టమేక పక్షి, కలివికోడి, పుంగనూరు ఆవులు, రాబందు ఇవన్నీ అంతరించిపోతున్న జాతులు.
16. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు.
-
జీవ వైవిధ్యం మనం చేయాల్సిన పనులు
- పాఠశాలల్లో, ఇంటి ఆవరణలో చెట్లను పెంచాలి.
- అడవిలో చెట్లను నరకకుండా చూడాలి.
- మన చుట్టూ ఉన్న జంతువుల పై పక్షులపై, కరుణ, దయ, వాత్సల్యం చూపాలి. ఆహారం ఇవ్వాలి.
- చేపలు వివిధ రకాల జీవులు నిలయమైన చెరువులు, నదులు, జలాశయాలను కలుషితం చేయరాదు.
- ప్లాస్టిక్ పంచులు, వ్యర్థ పదార్థాలు మొదలైనవి నీటి వనరులు వేసి నీటిలో ఉన్న ప్రాణుల వినాశనానికి కారకులు కారాదు.
- క్రిమిసంహారక మందులు, పెట్రోల్, బొగ్గు మొదలగు ఇంధనాలను విచక్షణ రహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు,
- ఇతర ప్రాణులకు జీవజాలానికి ముప్పు తెచ్చే ఎలాంటి పనులు చేయరాదు.
- జంతువుల సహజ ఆవాసాలను గ్రామాలు, నగరాల అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు. వీలుంటే అవి బతకడానికి సహాయపడాలి.
- మీ పాఠశాలలో జంతు సంరక్షణ ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయండి.
- జంతు ప్రపంచం ఆల్బమ్ తయారు చేయండి.
- వన్యప్రాణులను వేటాడడం నిషేధం. ఈ చట్టం గురించి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోండి.
- జంతువులపై, పక్షులపై దయ, కరుణ వాటికి చూపమని, వాటికి ఆహారం, నీళ్లు అందజేయమని అందరికీ తెలిసేలా ఒక పోస్టారు తయారుచేసి మీ గ్రామంలో ముఖ్యమైన స్థలంలో అతికించండి.
ANIMALS – THE BASE OF OUR LIFE
👉To Join Our Telegram group
👉To Join Our Whatsapp group
👉To Subscribe Our youtube channel
పైన ఉన్న బిట్స్ ప్రశ్నలు ప్రాక్టిసు చేయాలంటే ఇక్కడ నొక్కండి. Click Here