Advertisements

5th EVS | Let’s grow trees |3. మనం చెట్లను పెంచుదాం! Bits

Let's grow trees
Let's grow trees
Advertisements

మనం చెట్లను పెంచుదాం!

Let's grow trees 

Bits

మనం చెట్లను పెంచుదాం (Let’s grow trees ) పాఠంలోని ముఖ్యమైన నా ప్రశ్నలకు సమాధానాలు పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది.

Let’s grow trees

1. మన భూమి పై  అడవుల విస్తీర్ణం ’33’ శాతం ఉండాలి. Let’s grow trees 

2. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో ’21’ శాతం మాత్రమే అడవులు ఉన్నాయి.

3 . మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి అందుకే మొక్కలను ‘ఉత్పత్తి దారులని’ అంటారు.

4. నంది వర్ణనం ఉన్నది ‘పూల మొక్క’

5. నిమ్మ , మామిడి , జామ, సపోటా,  అరటి ,  ఇవన్నీ పండ్ల చెట్లు.

6. పారిజాతం , నందివర్ధనం,  గన్నేరు ,  మల్లె,  వంటివి పూల చెట్లు.

7. మునగ, కరివేపాకు, కొబ్బరి,  వేప,  మైదాకు,  టేకు,  లాంటి మొక్కలు ఇంటి ఆవరణలో నాటాలి.

8. పెద్ద పెద్ద వృక్షాలను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని ‘బోన్సాయ్’ లేదా ‘వామన వృక్షాలు’ అంటారు అయితే ఇది ‘జపాన్’ దేశం యొక్క సాంప్రదాయ కళ.

9.’డాంబరు’ పూసిన కర్రకు చెదలు పట్టవు.

10. పాఠశాలలో చెట్లను పెంచడానికి అవసరమైన సహాయం అందిస్తున్న సంస్థ ‘ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడుకోవడం కోసం ఏర్పడింది.

11. ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ సంస్థ ‘కోటి మొక్కలు’ నాటాలని శ్రీకారం చుట్టింది.

12.  ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్’ సంస్థ కోటి మొక్కలు సంకల్పంతో ‘వన ప్రేరణ ఉద్యమం’ చేపట్టింది.

13. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి ఇ పరిరక్షణ పట్ల శ్రద్ధ కనబర్చిన విద్యార్థులకు ‘వన ప్రేమి’ పురస్కారం మరియు ‘మెడల్’ తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది.

14. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం జనాభా నగరాలు పట్టణాలకు వలస వస్తుంది నగరాలలో ’67’ శాతం మంది జనం నివసిస్తున్నారు.

Let’s grow trees

15. వంటింటి వ్యర్థాలతో కంపోస్టును తయారుచేసి మేడపై బాల్కనీలో కుండీలు,  బస్తాలు,  పాలితిన్ సంచులు ,  గంపలు , తొట్టెలు,  బాక్సులు,  ప్లాస్టిక్ ప్లేట్లు,  సిమెంట్ బ్యాగులు,  ఇలా ఒకటేమిటి పాత టైర్లు నిచ్చెన లపై కూరగాయలు సాగుచేసేందుకు వీలుగా ,ఉద్యాన శాఖ, అధికారులు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు.

16.కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు,  మధుమేహం (షుగర్),  క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి.

17. ‘వేప’ చెట్టును ఐక్యరాజ్య సమతి’ శతాబ్ది వృక్షంగా’ ప్రకటించింది.

మీకు తెలుసా ?

పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అ అవగాహన కల్పించడం, వంటి లక్ష్యాలతో “నేషనల్ గ్రీన్ కోర్” ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

పైన ఉన్న బిట్స్ ప్రశ్నలు ప్రాక్టిసు చేయాలంటే ఇక్కడ నొక్కండి. Click Here