సూర్యుడు గ్రహాలు
ప్రాక్టిస్ టెస్టు చివర్లో ఉంది.
ఈ పాఠం లోని ముఖ్యాంశాలు
సౌర కుటుంబం
tet online practice
~ఆకాశంలో మేఘాలు సూర్యచంద్రులు నక్షత్రాలు తో పాటు కొన్ని గ్రహాలు తోకచుక్కలు లాంటివి కూడా ఉంటాయి.
~సూర్యుడు కూడా ఒక నక్షత్రమే.
~sooryudu భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకు పెద్దదిగా కనబడుతుంది వెలుతురును వేడిని ఇస్తున్నాడు.
~సూర్యుడు మండుతున్న ఒక అగ్నిగోళం.
~భూమితో పాటు మిగిలిన ఏడు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి.
సూర్యుడు ఎనిమిది గ్రహాలు.
~సూర్యుని చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటారు.
~సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు.
~యురేనస్ యొక్క పేరు వరుణుడు
~సూర్యుని చుట్టూ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు అనే ఎనిమిది గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
~అతి పెద్ద గ్రహం గురుడు.
~సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు.
~నెప్ట్యూన్ యొక్క మరొక పేరు ఇంద్రుడు.
~సూర్యుని నుండి భూమి మూడవ గ్రహం.
~పూర్వం ప్లూటో ను కూడా ఒక గ్రహంగా పరిగణించేవారు. కానీ ప్రస్తుతం ప్లూటో ని గ్రహంగా పరిగణించడం లేదు.
~ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఆ మార్గాన్ని కక్ష అంటారు.
పగలు , రాత్రి
~భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే రాత్రి పగలు ఏర్పడతాయి.
~భూమి గుండ్రంగా ఉండడం వల్ల సూర్యుని వైపు ఉన్న భూభాగంలో పగలు అవతలివైపు రాత్రి ఏర్పడతాయి.
~Bhoomi తన చుట్టూ తాను తిరగడానికి భూభ్రమణం అంటారు.
~భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరి భ్రమించడం భూపరిభ్రమణం అంటారు.
~Bhoomi ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి కి 24 గంటల సమయం (time) పడుతుంది. దీనినే మనం ఒక రోజుగా పరిగణిస్తాం. అంటే సుమారు 12 గంటల పగటి సమయం 12 గంటలు రాత్రి సమయం ఉంటాయి.
భూమి – చంద్రుడు
~అంతరిక్షం లో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటారు.
~భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు
~భూమి చుట్టూ చంద్రుడు ఒక క్రమబద్ధమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు.
~ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రుడికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది.
~సూర్యుని కాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందుతుంది. కక్ష్యలో తిరుగుతూ ఉన్నప్పుడు పౌర్ణమి రోజున చంద్రుడు మొత్తంగా చూస్తాం.
~చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
చంద్ర కళలు
చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు దాని ఆకారం మారినట్టు కనబడుతుంది. చంద్రుని పై ఉన్న ఉండే ప్రదేశాలు గ్రహించే సూర్యకాంతిలో మార్పుల వల్లే చంద్రుని ఆకారం లో తేడాలు ఉన్నట్లు భూమి నుండి కనబడుతుంది.
tet online practice
టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.
~ మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
~అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
~తరువాత NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
~చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
@Click text button below
@Read the questions and all options carefully and select your answer
@After every question click on next button
@Exam click on finish the text
@After completion of your exam to know right answer click on See Result