Advertisements

check on the tet result confusion టెట్ ఫలితాల గందగోళానికి చెక్

Advertisements

టెట్ ఫలితాల గందగోళానికి చెక్

check on the tet result confusion

జూన్ 12న నిర్వహించిన తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలు జూలై 01న విడుదలైన విషయం తెలిసిందే. అయితే టెట్ పేపర్-2లో ఉత్తీర్ణత శాతం పెరిగినా.. పేపర్-1లో మాత్రం ఎన్నడూ లేనంతగా 32శాతం ఉత్తీర్ణత వచ్చింది. దీంతో అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్ కీ’ ప్రకారం ఫలితాలను వెల్లడించలేదని, రెండింటికీ మధ్య తేడా ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మార్కు తేడాతో వేల మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారని ఫైనల్ కీ ప్రకారం రిజల్ట్స్ ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందని అభ్యర్థిస్తున్నారు. అయితే ఫలితాలపై గందరగోళానికి చెక్ పెట్టేందుకు షీట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని పలువురు అభ్యర్థులు టెట్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాలను ఇచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు త్వరలోనే ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

మరో వైపు డీఎస్సీ ప్రకటనకు ముందు మరో టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు సిద్దిపేటలో టెట్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. డీఎస్సీ అభ్యర్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తామని తెలిపారు.
అంటే డీఎస్సీ నోటిఫికేషన్కు మరో 6 నెలల సమయం పడుతుందని చెప్పకనే చెప్పారని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ఆరు నెలల సమయం ఉంది కాబట్టి మరో టెట్ నిర్వహణకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తే తాము ప్రిపేరేషన్ కొనసాగిస్తామని అంటున్నారు. త్వరలో గ్రూప్-4 నోటిఫికేష్తో పాటు గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. టెట్ ఫలితాల గందరగోళానికి చెక్ పెడుతూ, మరో టెట్ ప్రకటనపై ప్రభుత్వం స్పష్టత ఇస్తే.. గ్రూప్-4 పరీక్షకు ప్రిపేరవుతామని అభ్యర్థులు కోరుతున్నారు.

టెట్ ఫలితాల గందగోళానికి చెక్

check on the tet result confusion

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here