Advertisements

What next ? After TET ?

What next ? After TET ?
Advertisements

What next ? After TET ?

తెలంగాణాలో టెట్ పరీక్ష ఆదివారం (జూన్ 12) ప్రశాతంగా ముగిసింది. పేపర్ కొంత టప్ గా వచ్చినా.. క్వాలిఫై పర్సంటేజీ పెరుగుతుంది.

దీంతో డీఎస్సీలోనూ పోటీ పెరగనుంది. గత టెట్లలో 100కు పైగా మార్కులు ఉన్న వారికి మార్కులు పెరగక పోయినా… ఎగ్జామ్ ప్యాటర్న్ పై కొంత అవగాహన వచ్చింది.

ఈ సారి గతం కంటే భిన్నంగా ప్రశ్నలు అడిగిన తీరు ప్రతి అభ్యర్థి దృష్టిలో పెట్టుకోవాలి.

What next ? After TET ?

అయితే టెట్ పరీక్ష తర్వాత ఏంటి?

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?

ప్రిపరేషన్ కొనసాగించాలా.. నోటిఫికేషన్ వచ్చాకనే చదవాలా?

ముందుగా గురుకుల నోటిఫికేషన్ వస్తుందా?

డీఎస్సీ వస్తుందా?

బీఈడీ అభ్యర్థులు ఎస్టీజీకి ప్రిపేరవ్వాలా?

స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటికి ప్రిపేరవ్వాలా?

టెట్, డీఎస్సీకి మధ్య తేడాలేంటి?

అనే విషయాలతో పాటు టెట్ అభ్యర్థుల ప్యూచర్ ప్లాన్ పై సలహాలు సూచనలు అందిస్తున్నాం .. పూర్తిగా చదవండి..

What next ? After TET ?

  • టెట్ పరీక్ష ముగిసిందని పుస్తకాలు పక్కన పడేసి డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చాక చుద్దామనే ధోరణిని అభ్యర్థులు వీడాలి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన వారే విజేతలుగా నిలుస్తారనే విషయాన్ని మరిచిపోవద్దు. టీచర్ కల సాకారం చేసుకోవాలనుకునే అభ్యర్థులు మరో మూడు నెలలు ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే..
  • టెట్ పరీక్ష బాగా రాయలేదనే ఆందోళనతో కొంత మంది నిరుత్సాహపడుతుంటారు. Exam ముగిసింది కాబట్టి దానిని పక్కన పెట్టి డీఎస్సీలో మార్కుల సాధనకు కృషి చేయాలి. టెట్‌లో జరిగిన లోపాలను సవరించుకునే విధంగా డీఎస్సీ ప్రిపరేషన్ కొనసాగించాలి.
  • టెట్ సిలబస్, డీఎస్సీ సిలబతో పోల్చుకుంటే దాదాపు 80శాతం ఒకే విధంగా ఉంటుందని గమనించాలి.
  • సైకాలజీ స్థానంలో ‘విద్యా దృక్పథాలు’ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులోనూ సైకాలజీ రిలేటెడ్ అంశాలే ఉంటాయి.
  • ఇక జీకే. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, మిగతా టెట్ లో చదివిన కంటెంట్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు చదివిన దానితో పాటు ఎస్టీటీ అభ్యర్థులు 10వ తరగతి స్థాయి వరకు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంటర్ స్థాయి వరకు ప్రిపరేషన్ కొనసాగించాలి.

What next ? After TET ?

మొత్తం 80 మార్కులకు డీఎస్సీ ఉంటుంది. మిగతా 20 మార్కులు టెట్ మార్కుల వెయిటేజీ ఉంటుంది. టెట్ లో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో 2 మార్కులు కలుపుతారు. ఈ లెక్కన అభ్యర్థులు తాము సాధించిన టెట్ మార్కులతో డీఎస్సీలో ఎన్ని మార్కులు కలుస్తాయనేది లెక్కగట్టవచ్చు. మొత్తం 100 మార్కులతో అభ్యర్థుల మెరిట్ తీస్తారు.

What next ? After TET ?

  • గురుకుల, డీఎస్సీ నోటిఫికేషన్ ఏదీ ముందు, ఏదీ తర్వాత అనే విషయానికొస్తే అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి నోటిఫికేషన్ ఏదీ ముందు వచ్చినా.. రాసేందుకు సిద్ధంగా ఉండాలి.
  • బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంటు ప్రిపేరవుతే టీజీటీ, పీజీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్ రాసేందుకు అవకాశం ఉంటుంది. SGTకి ప్రిపేరవుతే గురుకుల పరీక్షకు కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టుకు మాత్రమే ప్రిపేరవ్వడం ఉత్తమం .
  • ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు పూర్తయిన తర్వాతనే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని సమాచారం.
  • ఇదంతా పూర్తయ్యే వరకు మరో మూడు నెలల సమయం పడుతుంది. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.
  • డీఎస్సీకి సిలబస్ విస్తృతంగా ఉంటుంది కాబట్టి కనీసం 6 నెలల సమయం అభ్యర్థికి తప్పనిసరి అవసరం.
  • నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని అనుకుంటే అప్పటికి ప్రభుత్వం సమయం ఇవ్వకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి రోజు కనీసం 6 గంటల సమయం కేటాయిస్తే మీ ప్రిపరేషన్ ఆగకుండా ఉంటుంది.

టెట్ ప్రిపరేషన్ కోసం మీరు సేకరించుకున్న మెటీరియిల్ లో పాటు ప్రస్తుతం విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలను ప్రచురించింది.

వాటిని మీరు సేకరించుకోవడం మంచింది. ఎందుకంటే జూన్ 12న జరిగిన టెట్లో ఇచ్చిన ప్రశ్నల్లో ఇంగ్లీష్ భాష పదాలతో కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిని పాఠ్యపుస్తకాల్లో గమనించవచ్చు.

కొత్త పుస్తకాలతో ప్రిపేర్ అవ్వడం ద్వారా తెలుగులో అర్థం కాని అంశాలను ఇంగ్లీష్ లో అర్ధం చేసుకుని జవాబులు గుర్తు పెట్టుకోవచ్చు. ఫైనల్లి.. మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు.. మీకు కావాల్సిన మెటీరియల్, బిట్ బ్యాంక్ ‘క్రియేటివ్ లెర్న్ వెబ్ సైట్ creativelearns.com లో అందుబాటులో ఉంటుంది. సద్వినియోగం చేసుకోగలరు.

This credit goes to మెరుపులు వెబ్ సైట్

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group
Advertisements
Click Here