good news for B.ed Aspirants బీఈడీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా టెట్ పరీక్షను నిర్వహించిన ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు టెట్ పేపర్-2తో పాటు పేపర్-1 కూడా రాసేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే..
తెలంగాణాలో దాదాపు 3లక్షల మంది బీఈడీ అభ్యర్థులున్నారు. వీరందరూ టెట్ రాసి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో…
ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. కేవలం బీఈడీ అభ్యర్థులకు మాత్రమే అర్హత కలిగిన గురుకుల టీచర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 9వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుదలో బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
అదేవిధంగా ఎస్సీ అభివృద్ధిశాఖలో 316, మహిళా శిశుసంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమశాఖలో 157, గిరిజన సంక్షేమశాఖలో 78, దివ్యాంగశాఖలో 71, జువైనల్ వెల్ఫేలో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులతో కలిపి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 91వేల ఉద్యోగాల ప్రకటన మేరకు మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.
టెట్ రాసిన తర్వాత ముందుగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా? లేక గురుకుల నోటిఫికేషన్ వస్తుందా అనే అయోమయంలో ఉన్న అభ్యర్థులకు ఆర్థిక శాఖ గురుకుల ఉద్యోగాలకు అనుమతి ఇవ్వడంతో కొంత క్లారిటీ వచ్చింది.
డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తే రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల జాతర మొదలైనట్టు భావించవచ్చు.
ఏదేమైనా సుమారు 5 సంవత్సరాల తర్వాత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో రాష్ట్రంలో దాదాపు 4లక్షల మంది అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…
This Credit goes to పాలపిట్ట వెబ్సైట్
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |