పాఠశాల విద్యార్థులకు Covid నిబంధనలు.
💠ప్రియమైన విద్యార్థులకు.
👉ఈరోజు బుధవారం (24-02-2021)నుండి 6 నుండి 8వ తరగతుల విద్యార్థులకు 11నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రత్యేక పరిస్థితులలో పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భములో కొన్ని
Covid
ముఖ్య సూచనలు:-
1.ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాల వరకు నిర్వహించబడును.
2. ఉదయం 9:30 గంటల వరకే యూనిఫాం ధరించి పాఠశాలకు హాజరు కావాలి..
3. తప్పకుండా నీళ్ల సీసా మరియు భోజనానికి ప్లేట్ తీసుకొని రావాలి.
4. వచ్చిన వెంటనే పాఠశాలలో ఏర్పాటు చేయబడిన సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి మరియు మూత్రశాలకు వెళ్లిన ప్రతిసారి మరియు భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
5.Class Room లో మరియు భోజనం సమయములో మీకు కేటాయించిన స్థానంలో మాత్రమే కూర్చోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ స్థానం మార్చుకోరాదు.
6. పాఠశాలలో ఉన్నప్పుడు ఇక్కడ కింద ఉన్న covid 19 నిబంధనలు తప్పకుండా పాటించాలి.
కొవిడ్-19 నిబందనలు:
Covid
విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన కొవిడ్ నియమ నిబందనలు
1).విద్యార్థినీ విద్యార్థులందరూ తప్పని సరిగా మాస్కు ధరించి పాఠశాలకు రావాలి.మాస్కులేని వారికి అనుమతి లేదు.
2).విద్యార్థికి విద్యార్థికి మరియు ఉపాధ్యాయులకు మధ్య 6 అడుగులు లేదా 2 గజాల భౌతికదూరం పాటించాలి.
3).ఇతరుల నుండి పెన్నులు, పెన్సిల్ లు, బుక్స్ , కాపీలు ఏవీ ఇతరులకు ఇవ్వవద్దు,ఇతరులనుండి తీసుకొనవద్దు.
4).ఇతరుల వస్తువులు ఏవి ముట్టుకున్నా చేతులు సబ్బుతో 20 seconds తరుచుగా శుభ్రపరుచుకోవాలి.
5).ఆహారం లేదా తినుబండారాలు ఏవికూడా ఒకరివి ఒకరు ఇచ్చుకొనవద్దు, ఎవరివి వారే తినాలి.
6).ఎవరి నీళ్ల సీసాలు వాళ్లే తెచ్చుకోవాలి-ఎవరి నీళ్ళు వారే తాగాలి.
7).పాఠశాల ఆవరణలో ఉమ్మి వేయకూడదు.
8).పాఠశాలకు వచ్చేటపుడు గుంపులుగా రాకూడదు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్ళకూడదు.
9).వాడిన మాస్కులు, ఖాళీ శానిటైజర్ సీసాలు, చిత్తుకాగితాలు, ఇతరవస్తువులు ఏమైనాఉంటే చెత్తడబ్భాలో మాత్రమే వేయాలి, ఆరుబయట పడవేయరాదు.
10) పాఠశాల లోపలికి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళే వరకు తరగతి గదిలో మరియు తరగతి గది బయట (ఆటస్థలం,బోజన సమయం,మూత్రశాల, చేతులు కడిగేటపుడు) ఏ విద్యార్థులు కూడా గుంపులుగా చేరవద్దు ఒంటరిగానే ఉండాలి. ఒంటరిగానే తిరగాలి.
11).అనవసరంగా ఎవరూ తరగతిగది నుండి బయటికి రావొద్దు…
12).జ్వరం,జలుబు,దగ్గు ,మొదలగు లక్షణాలు ఉన్నట్లయితే పాఠశాలకు సమాచారం ఇచ్చి, పాఠశాలకు రానవసరం లేదు.
13).పాఠశాలకు వచ్చిన తర్వాత జ్వరం ,జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నట్లైతే మీ ఉపాధ్యాయులను సంప్రదించండి.
మాస్కును విధిగా ధరిద్దాం! మనం దూరంగా ఉందాం!! – కరోనాను దూరంగా ఉంచుదాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
To Join Our Telegram group
To Join Our Whatsapp group