Advertisements

సంక్రాంతి కానుక ఏదీ? ఉద్యోగ , ఉపాద్యాయుల నిరీక్షణ

Advertisements

సంక్రాంతి కానుక ఏదీ?

Sankranthi Gift

 

Sankranthi Gift

  • ఫిట్మెంట్ పై స్పష్టత వస్తుందనుకున్నాం
  • సుదీర్ఘకాలం నిరీక్షించాం.. పండుగకు ఇస్తారనుకున్నాం
  • పీఆర్సీ నివేదిక ఇచ్చి 13 రోజులైనా బహిర్గతపరచరా!
  • ఎప్పుడైనా ఇచ్చేదే.. ప్రకటించడంలో జాప్యమెందుకు?
  • త్రిసభ్య కమిటీతో భేటీ కల్లే… కమిటీ వేయడమే వృథా
  • సర్కారు తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల మండిపాటు
సంక్రాంతి పండుగ వేళ.. వేతనాలు పెరిగి ఇంటిల్లి
పాదీ సంతోషంగా ఉంటామనుకుంటే.. ప్రభుత్వం
తమ ఆశలపై నీళ్లు చల్లిందని ఉద్యోగులు, ఉపాధ్యా
యులు ఉసూరుమంటున్నారు. ఎంతో కొంత ఫిట్
మెంట్ ను ప్రకటిస్తుందని ఆశ పడ్డామని, కానీ… ఫిట్
మెంట్, పీఆర్సీ ఏదీ లేకుండా పోయిందని ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడిస్తుందో, ఎంత ఇస్తుందో
తెలియడం లేదని, అసలు ఇస్తుందో లేదో కూడా
స్పష్టత లేదని మండిపడుతున్నారు. 11వ వేతన సవ
రణ సంఘం తమ నివేదికను డిసెంబరు 31నే ప్రభు
త్వానికి సమర్పించడంతో సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటన వస్తుందన్న ప్రచారం
జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఐఏ
ఎ తో త్రిసభ్య కమిటీని వేసి.. ఉద్యోగ సంఘాలతో
ఆ కమిటీ ఈ నెల 6, 7 తేదీల్లో సమావేశమవుతుం
దని ప్రకటించింది. కానీ, ఇప్పటివరకూ అటువంటి
సమావేశమేదీ జరగకపోగా, పీఆర్సీ నివేదికనూ తెర
వలేదు. నివేదిక పై అధ్యయనం చేసేందుకు కాపీని
ఇవ్వాల్సిందిగా సంఘాలు కోరినా ఇవ్వడం లేదు.
ముఖ్యమంత్రి సమక్షంలోనే నివేదికను తెరుస్తామని
ప్రకటించింది. కానీ, పీఆర్సీ నివేదిక ఇచ్చి 13 రోజులవుతున్నా.. చడీ చప్పుడు లేదని ఉద్యోగులుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “త్రిసభ్య కమిటీ సమావేశం కాదుగదా.. ఉద్యోగులను కమిటీ ఛాయలకు కూడా రానివ్వలేదు. అసలు ఆ కమిటీతో ఏమైనా ఒరుగుతుందా? అదేమైనా పనికొచ్చే
కమిటీయేనా?” అని ఓ ఉపాధ్యాయ సంఘం నేత మండిపడ్డారు. కాగా, ఉద్యోగులను పస్తులుంచి ప్రభుత్వం ఏం సాధిస్తుంది? అని నాలుగో తరగతి ఉద్యోగి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే ప్రభుత్వ కొలువు.. వేతనాలు అత్తెసరు. పెంపు కోసం పోరాడే పరిస్థితి లేదు. నోరెత్తితే ప్రభుత్వ
వ్యతిరేకి అన్న ముద్ర వేస్తారు. ఎందుకండీ ఈ సర్కారు నౌకరి?” అంటూ ఆయన నిట్టూర్చాడు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న హడావుడితో పీఆర్సీ అంశం కూడా తేలిపోతుందని ఆశించామని కానీ, ఇప్పుడుఫిట్మెంట్ ఇస్తారో లేదోనన్న సందిగ్ధతను ఎదుర్కొంటున్నామని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. సంక్రాంతికి ఫిట్మెంట్ను ప్రకటిస్తారనుకున్నామని, 14న సంక్రాంతి పండుగ దినాన ప్రకటించడం కష్టమేనని పేర్కొంటున్నారు.
20 తరువాతేనని సీఎంవో ప్రకటన..
నిజానికి ఈ నెల 20 తర్వాత ఫిట్మెంట్ ను ప్రకటించే అవకాశాలున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఇదివరకేవెల్లడించింది. దానికి ముందు పీఆర్సీ నివేదికను ఓపెన్ చేసి, ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని
నిర్వహించాలని త్రిసభ్య కమిటీని ఆదేశించింది. ఆ సమావేశం జరగకపోగా పీఆర్సీ నివేదిక సీల్ విప్పారో లేదో తెలియడంలేదని ఉద్యోగనేతలు అంటున్నారు. సమావేశం జరిగినా… నివేదిక కాపీని అందజేసినా… ఫిట్మెంట్ పై కొంత స్పష్టత వచ్చేదని, పీఆర్సీ సిఫారసు చేసిన ఫిట్మెంట్
తమకు నచ్చకపోతే… ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మరింత పెంచాలని కోరే వారమని చెబుతున్నారు. “ 13 రోజులైనా నివేదికను బహిర్గతం చేయరా? ఎప్పటికైనా తెరిచేదే కదా ? అందులో రహస్యం ఏమైనా ఉందా? అని ఆగ్రహించాడో గెజిటెడ్ అధికారుల సంఘం నేత. పైగా నివేదికపై చర్చించాలంటూ కమిటీలను వేసిన దాఖలాలు
గతంలో ఎప్పుడూ లేవని అంటున్నారు.
త్రిసభ్య కమిటీ ఒక వృథా కమిటీ అని అభి
వర్ణిస్తున్నారు. ఎప్పుడైనా ఫిట్మెంట్ ఇచ్చేదే
నని, అలాంటప్పుడు ప్రకటనలో జాప్యమెం
దుకు చేస్తున్నారని తెలంగాణ పంచాయతీ రాజ్ టీచర్స్యూ నియన్ నేత ఒకరు ప్రశ్నించారు.
ఇంత జాప్యం ఎప్పుడూ లేదు
గతంలో పీఆర్సీ ఫిట్మెంట్లను సాధ్య మైనంత త్వరగా ప్రకటించేవారని, కానీ.. ఈసారి ఏకంగా 30 నెలలు గడిచిపోయినా ప్రకటించడం లేదని ఉద్యోగులు తప్పుబడుతున్నారు. 2018 july 1 నుంచే పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తే తమకు ప్రయోజనకరంగా ఉండేదని,కానీ  అప్పటి నుంచి వేతనాలు పెరగకపోవడంతో తమకు రావాల్సిన జీతాల పెంపు వ్యత్యాసపు సొమ్ము రాకుండాపోయిందని చెప్పారు. కనీసం వీటి బకాయిలు ఇస్తారో లేదో తెలియడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ వేతనాలు ఈ ఏడాది April 1 నుంచే అమల్లోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోందని, అదే జరిగితే తాము 30 నెలల పెంపు వ్యత్యాసాన్ని కోల్పోయినట్లేనని ఉపాధ్యాయ సంఘం నేత ఒకరు అన్నారు. పీఆర్సీ ఆలస్యమయ్యే అవకాశాలుంటే ఏ ప్రభుత్వమైనా మధ్యంతర భృతి(IR)ని ప్రకటిస్తుందని, కానీ… ఈసారి ఐఆర్‌ను కూడా ప్రకటించలేదని గుర్తుచేస్తున్నారు. కాగా, ఫిట్మెంట్ ఇస్తుందో లేదో ప్రభుత్వం ధైర్యంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.అన్ని సంఘాలను పిలిచి ఫిట్ మెంట్ ను ఫైనల్ చేయాలన్నారు. త్వరలో కార్పొరేషన్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరిగే అవకాశమున్నందున.. పీఆర్సీ  ఫిట్‌మెంట్‌కు ఎన్నికల్ కోడ్ అడ్డమోస్తోందని భయపడుతున్నారని తెలంగాణ ఎంప్లాయిస్  అన్నారు. కోడ్ రాకముందే ఫిట్ మెంట్ ను ప్రకటించాలని కోరారు.

👉To Join Our Telegram group

👇👇👇👇👇

CLICK HERE

👉To Join Our Whatsapp group

👇👇👇👇👇

CLICK HERE

👉To Subscribe Our youtube channel

👇👇👇👇👇

CLICK HERE

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here