Advertisements

## పీఆర్సీ కానుకలు ##

Advertisements

 పీఆర్సీ కానుకలు 

 

PRC Gifts

 

👉 మొదటి కానుక : 16 మే 2018 గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతు 2 జూన్ 2018 న ఐఆర్ ప్రకటిస్తాం , 

15 ఆగస్టు 2018 నుండి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేస్తాం అని చెప్పారు

” చేతి నిండా పని – కడుపు నిండా భోజనం ” ఇది ఉద్యోగులకు అధ్బుతమైన కానుక అని చెప్పారు..

     అది పోయింది.

👉 రెండవ కానుక ;    అక్టోబర్ 2018 దసరా కానుకగా పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని త్వరలో ఉద్యోగుల కు సూపర్ డూపర్ శుభవార్త అని పత్రికలు రాశారు…

      అది పోయింది…

👉 మూడవ కానుక : డిసెంబర్ 2018 లో న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ అమలు కోసం సియం కెసిఆర్ సార్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది అని వివిధ పేపర్ లో వార్తలు రాశారు..

      అది పోయింది….

👉 నాల్గవ కానుక :: జనవరి 2019 లో సంక్రాంతి కానుకగా పీఆర్సీ… 

      అది పోయింది…

👉 ఐదవ కానుక :: 2 జూన్ 2019 నుండి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయుల కు పీఆర్సీ కానుక…

          అది పోయింది..

👉 ఆరవ కానుక :: అక్టోబర్ 2019 లో దసరా కానుకగా పీఆర్సీ అమలుకు రంగం సిద్ధం.

ఉద్యోగుల ఉపాధ్యాయుల కు పీఆర్సీ బొనాంజా….

       అది పోయింది..

👉 ఏడవ కానుక :: డిసెంబర్ 2019 లో మళ్లీ కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ…

       అది పోయింది….

👉 ఎనిమిదవ కానుక :: జనవరి 2020 లో సంక్రాంతి పండుగ కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ…

        ఇదీ పోయింది..

👉 తొమ్మిదవ కానుక :: 2 జూన్ 2020 రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటకు సియం కెసిఆర్ సిద్ధంగా ఉన్నారు..

     ఇదీ పోయింది.

👉 పదవ కానుక :: మళ్లీ  అక్టోబర్ 2020 లో దసరా కానుకగా పీఆర్సీ అమలు . ఉద్యోగుల ఆకాంక్ష లు నేరవేర పోతున్నాయి.. దాదాపు 45 శాతం ఫిట్మంట్ .‌..

పాలాభిషేకాలకు సిద్ధంగా ఉన్న టీజీవో టీఎన్జీవో నాయకులు…

      ఇదీ పోయింది..

👉ఇక పదకోండవ కానుక :::: ఈ కానుక డిసెంబర్ 2020 నెల నుండి ఊరిస్తుంది.. అంతా సిద్ధం.టిజివో టిఎన్జీవో సచివాలయ ఉద్యోగుల నాయకులు ప్రగతి భవన్ లో లంచ్ కూడ వెళ్ళారు. పీఆర్సీ నివేదిక ను బిశ్వాల్ గారి నుండి సియస్ సోమేష్ కుమార్ సార్ కు సీల్ కవర్ లో అదింప చేశారు.. 

హమ్మయ్య ఇక అయిపోయింది 

జనవరి 2021 లో 6,7 తేదీలలో ఉద్యోగుల తో చర్చలు ఆ తర్వాత సియం కెసిఆర్ సార్ తో చర్చలు మొత్తం మీద సంక్రాంతి కానుకగా 11 లేదా 12 న పీఆర్సీ కానుక..

  దాదాపు ఇది కూడ పోయినట్టే…..

👉 11 వ పీఆర్సీ అమలు కోసం 11 కానుకలు పోయినవి.

👉భవిష్యత్ లో ఇంకా ఎన్ని కానుక లను వదులుకోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి..

👉 వివిధ న్యూస్ పేపర్ లో ఈ కానుక లను చదివి చదివి విసిగి వేసారి పోయిన ఉద్యోగులు.

      💐🌷🙏🙏🌷💐

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here