Advertisements

TS SI exam instructions 2022

TS SI exam instructions 2022
Advertisements

TS SI exam instructions 2022

ఎస్ఐ ఎగ్జామ్ రాసే వారు తెలుసుకోవాల్సిన విషయాలు

👉పోలీస్ రిక్రూట్ మెంట్ ప్రాథమిక పరీక్ష (SI, Preliminary Written Test(PWT)

👉 పరీక్ష వేళలు: ఉదయం 10:00 నుండి మద్యాహ్నం 1:00 గం॥ల వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 9:00 గంల వరకే చేరుకోవాలి.

ఉదయం 10:00 గం||ల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి.

👉ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు.

👉 పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు

👉అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికేట్, పెన్ మాత్రమే తీసుకురావాలి.

👉 పరీక్ష కేంద్రంలో మొబైల్ ఫోన్స్ Laptop లు పెట్టుకోవడానికి ఎటువంటి Cloak Room సదుపాయాలు ఉండవు.

👉 అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి, లేనిచో పరీక్షకు అనుమతించరు.

👉 అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో అన్ని వివరాలను సరి చూసుకోవాలి.

👉హాల్ టికెట్ తో పాటు ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్లు అక్కర్లేదు.

👉 పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్ (ఆధార్ వేలి ముద్రలు) తప్పనిసరి.

👉 ప్రాథమిక పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు. కాబట్టి మెహెందీ, టాటూలూ పెట్టుకోవద్దు.

👉 పరీక్ష 200 అబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి (A,B,C,D ప్రశ్నా పత్ర కోడ్ వేర్వేరుగా), 200 మార్కులు

👉 ప్రతి తప్పు సమాధానంకి 0.20 మార్కు కట్ అవుతుంది.

👉 పరీక్షలో తప్పుగా గుర్తించిన సమాధానలకు నెగెటివ్ మార్కుటుంటాయి.

👉 అభ్యర్థులు తమ రూమ్ నెంబర్ మరియు సంబందిత సీట్ చేరుకొని ప్రశ్నాపత్ర కోడ్ ను పరిశీలించుకోవాలి.

👉విద్యార్థులకు పరిశుద్ధమైన నీరు హాలుకు దగ్గరలో అందుబాటులో ఉంచబడును.

👉పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండవలెను.

అభ్యర్థులు ఎగ్జాం విధి నిర్వహణలో ఉన్నవారు తప్ప ఎవరినీ పరీక్ష మెయిన్ గేట్ దాటి లోపలికి అనుమతించబడరు. పరీక్షకోసం నిర్ధారిత వేళల్లో బిగ్గరగా “బెల్” కొట్టిస్తారు, ఇన్విజిలేటర్ అభ్యర్థులకు ప్రకటిస్తారు.

👉 OMR Sheets లో OR Whitener ఉపయోగించరాదు.

👉 పరీక్ష ముగిసిన తర్వాత అందరి OMR Sheets తీసుకున్నాక, అందరి బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తయ్యాకనే అందరు అభ్యర్థులను ఒకేసారి బయటికి పంపిస్తారు.

👉కోవిడ్ నిబంధనలు మేరకు విద్యార్థులు మాస్క్ ధరించాలి.

👉థర్మల్ స్క్రీనింగ్ మరియు సానిటైజర్తో శుభ్రం చేసుకున్నాక కేంద్రంలోకి ప్రవేశించాలి.

👉సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకొండి…… విజయం సాధించండి.

తెలంగాణ లో SI ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి.

గమనిక :-ప్రతి ఒక్కరు ఎటువంటి భయందోళనకు గురి అవ్వకుండా, ప్రశాంతంగా, ఓపిక తో పైన నేనూ తెలియచేసిన జాగ్రత్తలు పాటించి… విజయాన్ని చేరాలిని కోరుకుంటున్న

👉 All the best….

TS SI exam instructions 2022

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here