Advertisements

VIDYA VOLUNTEERS | విద్యావలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్

VIDYA VOLUNTEERS
Advertisements

VIDYA VOLUNTEERS

తెలంగాణాలో టీచర్ల నియామకాలు ఆలస్యం కానుండడంతో సర్కారు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య దృష్ట్యా ఈ సారి భారీగా విద్యావాలంటీర్ల నియామానికి సర్కారు సిద్ధమవుతోంది.

సుమారు 18వేల వరకు విద్యావాంటీర్లను నియమించేందుకు సన్నాహాలు చేస్తుంది. టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులందరూ భావించారు.

కానీ భర్తీ ప్రక్రియకు ఇంకా ఆర్థిక శాఖ అనుమతులు జారీ కాకపోవడం, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టకపోవడం మరోవైపు పరస్పర బదిలీల గందరగోళం నేపథ్యంలో ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ వేసే ఆలోచననను ప్రభుత్వం విరమించుకుంది.

అయితే కరోనా నేపథ్యంలో చాలా వరకు ప్రైవేటు పాఠశాలలు మూత పడడం, అకడమిక్ ఇయర్ సరిగ్గా సాగుతుందో లేదోననే పలు అనుమానాల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించేందుకు మక్కువ చూపారు. దీంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

సంఖ్యకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యాబోధన ఇబ్బంది కరంగా మారుతోంది.

VIDYA VOLUNTEERS

ఈ విషయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. విద్యావాలంటీర్ల భర్తీ అంశాన్ని ముందుకు వచ్చింది.

2022-23 విద్యాసంవత్సరం అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 18వేల మంది విద్యావాలంటీర్లు అవసరమని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

ఈ మేరకు నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. గతంలో 16వేల మంది పనిచేయగా వారిని కరోనా నేపథ్యంలో తొలగించారు.

ఇప్పుడు తీసుకోబోయే విద్యావాలంటీర్లనూ కూడా కొత్త టీచర్లు వచ్చే వరకు పనిచేసే ఒప్పందంతో తీసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేస్తోంది.

విద్యావలంటీర్ల వేతనాలు పెంపు! తెలంగాణాలో విద్యావలంటీర్ల వేతనాలు గతంలో రూ.12వేలు చెల్లించారు. అయితే ప్రస్తుత నిత్యవసరాల ధరలు, ఇతర ఖర్చుల దృష్ట్యా సుమారు రూ. 15-18వేల వరకు పెంచాలనే డిమాండ్ వస్తుంది.

అయితే డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వస్తుందనే ఆశతో ఎంతమేరకు అభ్యర్థులు విద్యావలంటీర్లుగా చేరేందుకు సిద్ధంగా ఉన్నారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.

విద్యావలంటీర్ల భర్తీ ప్రక్రియ విధానం ఇదే.. విద్యావలంటీర్లుగా పనిచేసేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా బీఈడీ లేదా డీ.ఈడీ (టీటీసీ) చేసి ఉండాలి. టెట్ పరీక్ష తప్పనిసరిగా పాసై ఉండాలి.

ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వారికి ఇంటర్మీడియేట్ తో సహా డీఈడీ , ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వారికి డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత ఆధారంగా మెరిట్ తీస్తారు.

మెరిట్ విధానం కింది విధంగా ఉంటుంది. ప్రైమరీ వాలంటీర్లు ఇంటర్మీడియేట్- 40శాతం డిగ్రీ -10 శాతం డీఈడీ-30 శాతం టెట్-20 శాతం హైస్కూల్ వాలంటీర్లు

డిగ్రీ 40శాతం బీఈడీ 30 శాతం పీజీ 10 శాతం టెట్ 20 శాతం పై విధంగా మార్కుల మెరిట్జ్ మండలాల యూనిట్ గా మెరిట్ తీస్తారు. స్వంత మండలం వారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇందులోనూ రోస్టర్ విధానం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ అభ్యర్థులకు రిజర్వేషన్లు ఉంటాయి.

ఒక వేళ ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోతే తర్వాతి కేటగిరికి లేదంటే పక్క మండలం వారికి అవకాశం కల్పిస్తారు.

మండల పరిధిలో ఏ స్కూల్లో అయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.

Credit goes to పాలపిట్ట  వెబ్సైట్

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here