Advertisements

July 1 TS TET Results

Advertisements

July 1 TS TET Results
తెలంగాణ టెట్ ఫలితాలు జులై1న విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి చాంబర్ లో జరిగిన సమావేశంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ (టెట్ కన్వీనర్) రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెట్ ఫలితాలపై సమీక్షించిన మంత్రి ఎలాంటి జాప్యం చేయకుండా జులై 01న ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 12న జరిగిన టెట్ పరీక్షకు పేపర్-1, పేపర్-2 కలిపి సుమారు 3.8 లక్షల మంది హాజరయ్యారు.

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group
Advertisements
Click Here