Advertisements

5th EVS{TEST-8}FORESTS – TRIBALS !Practice Bits.పార్ట్ 1

Advertisements

అడవులు గిరిజనులు !

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

FORESTS – TRIBALS

పార్ట్ 1 

FORESTS – TRIBALS

పాఠం లోని కొన్ని అంశాలు

గిరిజనుల జీవన విధానం 

(FORESTS – TRIBALS) గోండు తెగవారు ఆదిలాబాద్ లో నివసిస్తారు. వెదురు బొంగులతో అడవి గడ్డిని ఉపయోగించి గుడుసెలు కట్టుకుంటారు. పూజకు, స్త్రీలకు కూడా ప్రత్యేకమైన గదులు ఉంటాయి. గోండు జాతి వారు అడవిలో లో ఎక్కువగా దొరికే పండ్లు, చింతపండు, తేనె వంటి వాటిని సేకరించుకుని వాటి పైనే ఆధారపడి బతుకుతారు. కానీ కొందరు గోండులు వ్యవసాయం కూడా చేస్తారు. పంటలు పండిన తర్వాత ఒక ప్రత్యేక పండుగ చేస్తారు. గ్రామ దేవత “అకిపెన్” కు మొదటి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పంటలను ఉపయోగించుకుంటారు.FORESTS – TRIBALS

నాగోబా జాతర

గోండులకు “నాగోబా” అతి ముఖ్యమైన జాతర. నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఇతర రాష్ట్రాలలో ఉండే గోండులు కూడా పాల్గొంటారు. ఈ జాతరలో ముఖ్యంగా చెప్పవలసింది నెమలి పింఛాలతో ప్రత్యేకంగా అలంకరించుకుని గోండులు చేసే సాంప్రదాయ నృత్యం. దీనిని “గుస్సాడి” నృత్యం అంటారు.

చెంచుల జీవన విధానం

మన తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తూ ఉంటారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంటారు. వీరు మాట్లాడే భాష తెలుగు భాష లాగే ఉంటుంది. చెంచుల  ఆహారం చాలా విభిన్నంగా ఉంటుంది. వీరు ఎక్కువ అడవి పైనే   ఆధారపడి జీవిస్తారు. అందుకే అడవిని “తల్లి”గా పూజిస్తారు. తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్లు వేరే ఎవరికీ తెలియదు. విల్లు , బాణాలు, చిన్న కత్తులు ఉఅపయోగించి జింకలను , అడవి పందులను వేటాడుతారు. అయితే వీళ్ళు కుందేళ్లు, పిచ్చుకలు చిన్న జంతువులను ఎప్పుడు వెటాడారు.

చెంచు కుటుంబాలు అన్నీ ఒకే ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటిని “పెంటలు”  అంటారు. వీరు లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ మాఘ మాసంలో నిర్వహిస్తారు.

బోండా జాతి గిరిజనులు – జీవన విధానం

మీరు కూడా అడవిలోనే జీవిస్తారు. ఈ తెగ వారు దాదాపు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో  కూడా తెలియకుండా జీవిస్తున్నారు. బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండలలో దట్టమైన అడవుల్లో , పక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రంలో మల్కాన్ గిరి  జిల్లాలోని దట్టమైన అడవుల్లోను ఉంటారు. వీరిని  బోండో , పోరాజు అని కూడా అంటారు. వీరు మాట్లాడే భాష వింతగా ఉంటుంది. దీనిని “రెమో” అని అంటారు. వీరు జరుపుకునే సంతను “హతా “అని అంటారు.

FORESTS – TRIBALS

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  • తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి
  •  చివరికి SUBMIT ను ప్రెస్ చేయండి మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on view questions
FORESTS – TRIBALS
557
Created on By CREATIVELEARNS
Advertisements

7.అడవులు – గిరిజనులు Part 1

1 / 15

ఈ క్రింది వారిలో ఎవరు తేనెను సేకరించడంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ?

2 / 15

చెంచులు ఎవరిని తల్లిగా భావిస్తారు ?

3 / 15

చెంచుభాష ఏ భాష లాగ ఉంటుంది ?

4 / 15

చెంచులు తెలంగాణలో ఏ జిల్లాలో ఉంటారు ?

5 / 15

చెంచులు ఏ అడవులలో నివసిస్తూ ఉంటారు ?

6 / 15

నాగోబా జాతరలో గోండులు చేసే సాంప్రదాయ నృత్యం ఏమిటి ?

7 / 15

నాగోబా జాతర ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ?

8 / 15

నాగోబా జాతర ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది ?

9 / 15

నాగోబా జాతర ఏ గ్రామంలో జరుగుతుంది ?

10 / 15

నాగోబా జాతర ఏ మండలంలో జరుగుతుంది ?

11 / 15

ఆదిలాబాద్ లో  ఉండే గిరిజన తెగ?

12 / 15

గోండులు ఏ దేవతకు నైవేద్యం పెట్టిన తరువాత వారు పండించిన పంటను వినియోగించుకుంటారు ?

13 / 15

గోండుల యొక్క గ్రామ దేవత?

14 / 15

గోండులకు అతి ముక్యమైన జాతర?

15 / 15

నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?

Your score is

The average score is 82%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.