భద్రతా – చర్యలు
TET మరియు TRT
భద్రతా చర్యలు ఐదో తరగతి పరిసరాల విజ్ఞానం.
ఈ పాఠంలో రోడ్డు భద్రతా చర్యల గురించి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలి, విద్యార్థులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ పాఠం లో ఉంటుంది.tet online practice exam in telugu
మీకు తెలుసా?
సినిమాహాళ్లు, కార్యాలయాలు, బహుళ అంతస్తుల భవనాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణకు భద్రతా చర్యలలో భాగంగా అగ్నిమాపక కేంద్రాలు అమరుస్తారు. కొందరికి వీటిని ఎలా ఉపయోగించాలో శిక్షణనిస్తారు.
ఈ పాఠంలోని ముఖ్యాంశాలు
- భద్రత ఎప్పుడు అవసరం
- ప్రమాదాలు – నివారణలు
- గుంపులుగా గుమిగూడి ప్రాంతాలలో ఎలాంటి భద్రతా చర్యలు అవసరం?
- నీటి ప్రమాదాలు
- భూకంపం
- వరదలు
- ప్రథమ చికిత్స
- ఎవరు సహాయం చేస్తారు
- tet online practice exam telugu
పై అంశాల గురించి ఈ పాఠంలో చర్చించడం జరిగింది.
మీకు తెలుసా? tet online practice exam telugu
ప్రమాదం జరిగిన నా మొదటి గంట ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఎందుకంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాలలో ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు.
ఈ క్రింది ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలో కూడా ఈ పాఠంలో ఉంటుంది.
బెణికిన గాయాలు అయితే ఏం చేయాలి?
బెణికిన గాయంపై ఆయింట్మెంట్ తో గట్టిగా రుద్దకూడదు. ఆ ప్రాంతానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. మెడికల్ షాపులో దొరికే ‘క్రేప్ బ్యాండేజ్’ తో కట్టు కట్టాలి. గాయం అయిన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి.
కాలిన గాయాలకు ఏం చేయాలి?
మొట్టమొదట కాలిన ప్రాంతాన్ని ధారగా వచ్చే చల్లని నీటి కింద లేదా చల్లని నీటిలో 10 నుండి 20 నిమిషాల పాటు పెట్టాలి. ఆ తదుపరి అర చేయి మందం లోపు గాయం అయితేనే ఆ గాయంపై ఆయింట్మెంట్ రాయాలి.
గుర్తుపెట్టుకోండి – ఎప్పుడూ కాలిన బొబ్బల్ని చిదపరాదు. కాలిన గాయానికి బ్యాండేజ్ గుడ్డతో కట్టరాదు. ఐస్ పెట్టరాదు. మనకు మంటలు అంటుకున్నప్పుడు పరుగెత్త కూడదు. గాలికి మంటలు ఎక్కువై ప్రమాదం జరగవచ్చు. అప్పుడు SDR నియమం పాటించాలి. STOP (ఆగండి) DROP (కిందపడిపోండి) ROLL ( అటూ ఇటూ దొరలండి).
పాయిజన్ తీసుకుంటే ఏం చేయాలి?
‘పాయిజన్’ తీసుకున్న వ్యక్తికి సాధ్యమైనంత వరకూ ఆ విష తీవ్రత తగ్గించడానికి ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తికి వాంతి చేయించకూడదు. స్పృహ తప్పిపోనివ్వకూడదు.
స్పృహ తప్పి పోతే ఏంచేయాలి?
గృహ తప్పిపోయిన వ్యక్తిని, ప్రక్కన తిప్పి పడుకోబెట్టి, గడ్డాన్ని ఎత్తిపెట్టి, ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వెల్లకిలా పడుకోబెట్టి తీసుకెళ్లకూడదు. అలా తీసుకెళ్లడం వల్ల నాలుక గొంతు కి అడ్డంపడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.
గుండెపోటు వస్తే ఏం చేయాలి?
‘గుండెపోటు’ అంటే చేతిలోని నొప్పి అని అనుకుంటారు. ఏ వ్యక్తికైనా నా ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లు గా ఉండి నొప్పి ఉండటంతోపాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా గుండెపోటు అని చెప్పవచ్చు. ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారంగా ఉండి చాతి నొప్పి కూడా వస్తే ‘గుండెపోటు’ గా అనుకోవచ్చు.
ఆ సమయంలో లో మన దగ్గర అ ఏ మందులు లేకుంటే ఆ వ్యక్తి ని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టె ఆస్పత్రికి తీసుకెళ్లాలి. పడుకో బెట్టకూడదు – నడిపించకూడదు – నిల్చోబెట్టకూడదు.
ఎముకలు విరిగితే ఏం చేయాలి? tet online practice exam telugu
ఏ ఎముకా విరిగినా, ఆ ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
పక్షవాతాన్ని ఎలా గుర్తుపట్టాలి?
మీ ఇంట్లో ఎవరికైనా ఎక్కువ బి.పి. ఉంటే వాళ్లు ఒళ్ళు తిరుగుతోందని, తిమ్మిరిగా ఉందని చెప్తే మొట్టమొదట ఆ వ్యక్తిని నవ్వి చూపెట్టమనండి. ఆ వ్యక్తి యొక్క మూతి నవ్వే టప్పుడు వంకరగా ఉంటే, సరిగ్గా మాట్లాడు లేకపోతే మరియు చేతులు ఎత్తి లేకపోతే దానిని పక్షవాతం చిహ్నంగా గుర్తించాలి. ఆ వ్యక్తిని తక్షణమే ( గోల్డెన్ అవర్లో ) ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
కుక్క కాటుకి గురైతే ఏం చేయాలి?
కుక్క, కోతి, పిల్లి , సుందెలుక వంటివి ఏవి కరిచినా ఆ ప్రాంతాన్ని సబ్బు నీళ్ళతో కడగాలి. కానీ ఆ గాయాన్ని బ్యాండేజ్ క్లాత్ తో వేయడం గానీ, కుట్టు వేయడం గానీ చేయకూడదు.
పాము కాటుకి గురైతే ఏం చేయాలి?
‘పాము కాటు’కి గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం భయం. మనం చేయాల్సిందల్లా ఆ వ్యక్తికి ధైర్యం ఇవ్వాలి. పాము కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా ఉంచాలి. స్పృహ తప్పి పోకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
‘వడ దెబ్బ’ తగిలితే ఏం చేయాలి?
ఎండలో తిరిగిన ప్రతి వారికి వడదెబ్బ సంభవించదు. వడదెబ్బ లక్షణాలు ఏంటంటే ఆ వ్యక్తికి విపరీతమైన జ్వరం, ఒళ్లు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండటం, బాగా తలనొప్పి ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు ఉన్నా వారిని నీళ్లు తాగించే ప్రయత్నం చేయకండి. మొదటగా ఆ వ్యక్తి శరీరాన్ని చల్లని నీటిలో ఉంచినా గుడ్డతో తుడవాలి. ఆ తర్వాతే O.R.S. ద్రావణం కానీ ఎలక్ట్రాన్ , కలిపిన నీటిని కానీ ఇవ్వాలి.
కంట్లో రసాయనాలు
ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కంట్లో రసాయనాలు పడితే ఆ ప్రాంతాన్ని ఉదృతంగా ప్రవహించే చల్లని నీళ్ళ కింద కంటిని కనీసం 15 నుండి 20 నిమిషాలు ఉంచాలి.
తీవ్రమైన మంట ఉన్నా కూడా కళ్లు నులిమే ప్రయత్నం మాత్రం చేయకూడదు. రసాయనం పడిన కంటిని పక్కన ఉన్న కన్నుకు ఇబ్బంది కలగకుండా , ఎటువైపు పడిందో అటువైపు నుంచి ప్రవహించే నీళ్లలో కింద ఆ రసాయనం పోయేదాకా కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకూ కన్నును ఉంచాలి.
కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలి?
మనం ప్రార్థనలో నిలుచున్నప్పుడు, సరిగ్గా తినకుండా పాఠశాలకు వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి కింద పడి పోయే అవకాశాలు ఉన్నాయి కదా! అప్పుడు ఆ వ్యక్తిని చెంపలపై తట్టడం లాంటిది చేయకుండా పడిపోయిన వ్యక్తి కాళ్లని ఎత్తుగా పెట్టి తలని పక్కకు పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చునే అవకాశం ఉంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే మెదడు రక్త ప్రసారం తక్కువ కావడం వల్ల. మనం కాళ్ళు ఎత్తి పట్టడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
గుండె ఆగిపోతే
ఇప్పుడు మనం అతి ముఖ్యమైన సి. పి. ఆర్. అంటే ఏమిటో తెలుసుకుందాం.
ఎవరైనా వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వల్లకాని, తీవ్రమైన కరెంట్ షాక్ వల్లగాని, ఇంకే కారణం వల్లగానీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అక్కడుంటే చేసే ప్రక్రియని C.P.R అంటాం. C.P.R అంటే- C-Cardio(గుండె), P-Palmonary(ఊపిరితిత్తులు) R- Resuscitation & Restart ( తిరిగి స్టార్ట్ చేయడం) అంటాం.
ఇది ఎలా చేయాలంటే గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతీ మధ్య ఎముక అంతం అయిన చోటి నుండి 2-3 అంగుళాల పైన మీ అరచేతితో అదిమి పెట్టి, మీ చేతిని నిటారుగా ఉండేట్టు చూస్తూ మధ్య ఎముకపై 30 సార్లు వత్తిడి కల్గించాలి. (మరీ గట్టిగా కాకుండా సున్నితంగా కాకుండా)– ఆ తదుపరి నోటి నుంచి నోటి ద్వారా 2 కృత్రిమశ్వాసల్ని. ఊపిరితిత్తుల్లోకి పంపించాలి. ఇలా నిమిషానికి(30:2 x 3) 30 సార్లు వత్తిడి కల్గిస్తూ రెండు సార్లు కృత్రిమ శ్వాసలను ఇవ్వాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఇలా ఆ వ్యక్తి గుండె స్టార్ట్ అయ్యేవరకు మనం ప్రయత్నం చేయాలి. కృత్రిమ శ్వాసలోనికి పంపించినప్పుడు ముక్కు రంధ్రాల్ని మూయడం – గెడ్డాన్ని పైకెత్తడం మరిచిపోవద్దు సుమా!
గొంతులో ఏదైనా అడ్డుపడితే ఏం చేయాలి?
గొంతులో ఏదైనా అడ్డుపడితే ఆ వస్తువును చేతితో లాగి తీసే ప్రయత్నం చేయకూడదు. ఆ వ్యక్తిని అందరికీ వందనం అని చెప్పి వీపుపై 4-5 సార్లు చరచాలి. చరచినప్పుడు దగ్గమని చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా బయటకి రాకుంటే కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్తే ఆ వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
రక్తస్రావాన్ని ఆపడం ఎలా?
ఎక్కడా చిన్నపాటి రక్తస్రావం అయినా ఆ ప్రాంతాన్ని గట్టిగా అదిమి పెట్టి, గుండె కంటే ఎత్తుగా పెట్టాలి. అధిక రక్తస్రావం లో కూడా అలాగే చేసిన – రక్తస్రావం అంతగా ఆగే అవకాశం ఉండదు కనుక ఆ వ్యక్తిని మొట్టమొదట గంటల్లోనే ఆసుపత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి.
ముక్కు నుంచి రక్తస్రావం వస్తే ఎలా?
ముక్కు నుంచి రక్తస్రావం వస్తే – ఎప్పుడూ తలని వెనక్కి పెట్టకూడదు. తలని ముందుకు వంచి, ముందు ఉన్న మెత్తటిభాగాన్ని పది నిమిషాల దాకా ఒత్తి పట్టాలి. దూది లాంటి వాటిని పెట్టి ఆపే ప్రయత్నం చేయకూడదు. బి.పి ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకి 5-10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బి.పి. ‘సెప్టివాలు’ పని చేస్తుందన్నమాట.
‘కరెంట్ షాక్’ కొడితే ఏం చేయాలి?
ఇంట్లో కరెంటు షాక్ సంభవిస్తే, మొదలు స్విచాఫ్ చేయాలి. ప్లగ్ ను తీసేయాలి. అలా లాగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరకెళ్ళి , ఆ వ్యక్తి గడ్డాన్ని పైకెత్తాలి. అలా ఎత్తడం వల్ల శ్వాస ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో నోటి నుంచి నోటి ద్వారా కృత్రిమ శ్వాస ఇవ్వాలి. ఒక్కోసారి ‘కరెంట్ షాక్’ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే “కార్డియాక్ అరెస్ట్ ” అంటారు. ఆ వ్యక్తికి కృత్రిమ శ్వాస ఇవ్వడమే కాకుండా డా నా గుండెని తిరిగి కొట్టుకునేలా ప్రయత్నం చేయాలి.
మీకు తెలుసా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, ఘాటు పెట్టడం, రక్తం పీల్చడం వంటివి చేయరాదు. తాడు కట్టడం వల్ల రక్తం సరఫరా లో ఇబ్బంది కలగవచ్చు. శుభ్రపరచని బ్లేడ్లు, చాకు వంటివి ఉపయోగించి ఘాటు పెట్టడం వల్ల ధనుర్వాతం రావచ్చు. రక్తాన్ని నోటితో పిలిస్తే విషయం వారి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.
tet online practice exam in telugu
tet practice papers అందుకోసం ప్రిపేర్ అయ్యే వారికి ఈ పరీక్ష ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది క్రింది పరీక్షలు రాసి నచ్చినట్లయితే మీ మిత్రులతో పంచుకోండి.
టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.
- మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
- అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
- తరువాత NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
- చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
- Click text button below
- Read the questions and all options carefully and select your answer
- After every question click on next button
- Exam click on finish the text
- After completion of your exam to know right answer click on See Result
తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.